Father Suicide After Killing Three Children Rangareddy : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి అనంతరం ఓ తండ్రి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మోకిలా పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి(Govt Hospital) తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్థలం కోసం వైసీపీ నేతల దౌర్జన్యం - రౌడీలతో బెదిరింపులు, భయంతో మహిళ ఆత్మహత్యాయత్నం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అప్పుల బాధతో నిరటి రవి(35) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పిల్లలను చంపి అనంతరం చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొంతకాలంగా స్వగ్రామంతో(Hometown) పాటు ఇతర గ్రామాల్లో తనకు తెలిసిన సన్నిహితులు, బంధువుల వద్ద నుంచి మనీ స్కీమ్ ద్వారా వెయ్యికి మూడు వేల రూపాయలు, రూ.లక్షకు రెండు నెలలకు గానూ రూ.5 లక్షలు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకున్నాడు.
సచివాలయంలో ఉరేసుకుని వాలంటీర్ ఆత్మహత్య
తన డబ్బు కూడా ఈ స్కీమ్‌లోనే పెట్టి స్కీమ్ నిర్వాహకుడికి ఇచ్చాడు. అయితే తన డబ్బుతో పాటు ఇతరుల డబ్బు కూడా తీసుకున్న ఆ వ్యక్తి తిరిగి సొమ్ము చెల్లించలేదు. నగదు కట్టిన వారంతా సొమ్ము కోసం రవి ఇంటికి వచ్చి గొడవకు దిగారు. తమ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తను మోసపోవడమే గాక తన వల్ల ఎంతో మంది మోసపోయేలా చేసానని రవి మనస్తాపం చెందాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థంగాక చివరకు ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. అయితే తను చనిపోతే తన పిల్లలు అనాథలై పోతారని భావించాడో లేక వారంతా డబ్బు కోసం తన పిల్లలను ఇబ్బంది పెడతారనుకున్నాడో కానీ వాళ్లను చంపేసి అనంతరం తాను చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
వాలంటీర్ వేధింపులు తాళలేకే బాలిక ఆత్మహత్యాయత్నం: జనసేన
ఇలా మనీ స్కీమ్‌తో ఎంతో మంది మోసపోతున్నారని పోలీసులు తెలిపారు. చివరకు డబ్బు పోయిందనో, లేక ఇలాగే ఇతరులను కూడా అందులో భాగస్వాముల్ని చేసి చివరకు డబ్బు చెల్లించలేక ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. వెయ్యికి రెండు వేలు, లక్షకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పే వారి మాటలు నమ్మకూడదని పోలీసులు సూచించారు. వారు మొదట రెండు మూడు సార్లు డబ్బు చెల్లించి నమ్మకం కుదిరాక ఇలా పెద్ద మొత్తంలో నగదుతో పరారవుతారని తెలిపారు. అందుకే ఇలాంటి స్కీమ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.