ETV Bharat / state

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె - ఆమెకు భోజనం తీసుకెళ్తుండగా తండ్రి - నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు! - Father and Daughter Died at a Time - FATHER AND DAUGHTER DIED AT A TIME

Father and Daughter Died at a Time : నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దురదృష్టవశాత్తు తండ్రీకుమార్తెలు ఇరువురూ ఏకకాలంలో మృతి చెందిన సంఘటనతో ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Father and Daughter Died on Same day
Father and Daughter Died at a Time (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 3:55 PM IST

Father and Daughter Died on Same day in Nizamabad : బలవన్మరణానికి పాల్పడి కుమార్తె, రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన మాలోత్ జ్యోతి (35)కి 15 ఏళ్ల కిందట అబ్బాపూర్ తండాకు చెందిన ప్రకాశ్​తో వివాహం జరిగింది.

ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే నాలుగేళ్ల కిందట ప్రకాశ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి జ్యోతిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. భర్త వేధింపులు భరించలేక 21వ తేదీ సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు నిజామాబాద్​లోని జీజీహెచ్​కు తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తె కోసం గురువారం రాత్రి భోజనం తీసుకువచ్చేందుకు తండ్రి లక్ష్మణ్ రాథోడ్ (60) బండిపై వెళ్తుండగా, కల్యాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. అయితే అంతకు కొద్దిసేపు ముందే కుమార్తె జ్యోతి పరిస్థితి సైతం విషమించి మృతి చెందింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలో తండ్రీకుమార్తెలు ఇరువురు మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కుమార్తె మెహందీ వేడుకలో డాన్స్ చేస్తూ తండ్రి మృతి.. వధువుకు చెప్పకుండానే పెళ్లి

చెరువులోకి దిగి తండ్రి మృతి.. తండ్రిని వెతుకుతూ.. కుమారుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.