Excavation for Hidden Treasures in Siddipet : అడవిలో రాళ్లు సమానంగా పేర్చి ఉండటంతో గుప్త నిధులు (Hidden Treasures) ఉన్నాయనే ఆశతో త్రవ్వకాలు ఆరుగురు వ్యక్తులు తవ్వకాలు జరిపారు. కొన్ని రోజులుగా ఇలా అక్కడే తవ్వకాలు జరుపుతుండేవారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. వెంటనే ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామ శివారు ప్రాంతంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామ శివారులోని పెద్ద గుట్ట సమీపంలోని ఆరుగురు వ్యక్తులు అడవిలో గుప్త నిధులకోసం త్రవ్వకాలు జరిపారు. రాంసాగర్కు చెందిన కిష్టయ్యకు అడవిలో వేటకు వెళ్లే అలవాటు ఉంది. తాను వేటకు వెళ్లినప్పుడు పెద్దగుట్ట సమీపంలో ఒకచోట రాళ్లు ఒక క్రమపద్ధతిలో పేర్చి ఉండడం గమనించాడు.
Hidden Treasures in Telangana : అక్కడ త్రవ్వితే ఏదైనా దొరికే అవకాశం ఉందని భావించి, గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లికి చెందిన పోచయ్య అనే వ్యక్తికి ఈవిషయం చెప్పాడు. వారిద్దరికి సదరు ప్రాంతంలో తవ్వడం అసాధ్యమని భావించి, మరో నలుగురు సహాయం తీసుకుందామని అనుకున్నారు. దీనికోసం సదరు వ్యక్తులను పరిచయమున్న రామచంద్రం, మహంకాళి, నరేందర్, స్వామికి సమాచారం ఇచ్చారు. వీరందరూ కలిసి గత కొన్ని రోజులుగా పెద్దగుట్ట వద్ద తవ్వకాలు జరపడం ప్రారంభించారు.
స్థానికులకు సమాచారం అందించిన పోలీసులు : ఈ మొత్తం విషయాన్ని కొన్ని రోజులుగా స్థానికులు గమనిస్తుండేవారు. వారు చేస్తున్న గుప్త నిధుల తవ్వకం గురించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని, గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఇంకా ఇలాంటి నిధుల గురించి సమాచారం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు - నిజామాబాద్లో కలకలం రేపిన ఘటన
గుప్తనిధి పేరుతో గొర్రెల వ్యాపారులకు టోకరా - రూ.2 కోట్ల ఆశ చూపించి రూ.40 లక్షలు స్వాహా