Ex SIB DSP Praneeth Rao Case Updated : ఎస్ఐబీ మాజీ డీఎస్పీ కేసు విచారణలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ విధుల్లో మావోయిస్టులకు సంబంధించిన సమాచార సేకరణ చేయాల్సి ఉంటుంది. వారి కదలికలను కనిపెట్టడం, సంభాషణలు సాగించే వ్యక్తుల వివరాలను గుర్తించడం చేయాల్సి ఉంటుంది. ఈ పనితో పాటు ప్రణీత్ తన బృందంతో కలిసి ప్రైవేటు వ్యక్తులపైనా సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఉంచినట్లు ఆరోపణలు వినిపించాయి.
రెండో రోజు ప్రణీత్‌రావు విచారణ - బంజారాహిల్స్ పీఎస్‌లోకి ఎవరినీ అనుమతించని పోలీసులు
అతడిని అరెస్ట్ చేసిన అనంతరం న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించిన క్రమంలో కీలకాంశాలు బయటపడుతున్నాయి. డిసెంబరు 3న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే తనపై ఉచ్చు బిగుస్తుందనే ఉద్దేశంతోనే ప్రణీత్ ఆధారాల ధ్వంసం చేసినట్లు విచారణలో తేలింది. ప్రత్యేకబృందాలు గాలింపు చేపట్టి హార్డ్‌డిస్క్‌ల శకలాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గతంలో ఎస్ఐబీలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ఆదేశాల మేరకే తాను వాటిని ధ్వంసం చేశానని ప్రణీత్ చెప్పినట్లు తెలుస్తోంది.
Ex SIB DSP Phone Tapping Case Updates : డేటా రెప్లికేషన్‌పై దర్యాప్తు బృందాల దృష్టి పెట్టాయి. కట్టర్లు, ఇతర సామగ్రితో ధ్వంసం చేసిన డేటాను సైతం రిట్రీవ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక డేటాబేస్‌లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా సరే అవతలి వ్యక్తికి బదిలీ అయిన డేటాను విశ్లేషించడం ద్వారా ఆ సమాచారాన్ని సేకరించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ ఆధారంగానే ప్రణీత్ ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌ల్లోని సమాచారాన్ని ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో రిట్రీవ్ చేసే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. ఆ సమచారాన్ని విశ్లేషించగలిగితే మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటితో ప్రణీత్ రావు ఏడు రోజుల కస్టడీ ముగుస్తున్నందున పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Praneeth Rao Phone Tapping Case : స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ కాల్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అటు రాజకీయాల్లోనూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్‌ఐబీ) డీఎస్పీగా ప్రణీత్‌రావు పనిచేశారు. అప్పుడు ఎస్‌ఐబీ కార్యాలయంలోని రెండు గదుల్లో ఉన్న 17 కంప్యూటర్లను ప్రణీత్‌రావు అనధికారికంగా వాడుకున్నారు. వీటికి ప్రత్యేకంగా ఇంటర్నెట్ సదుపాయం పెట్టుకున్నారు. ఇటీవల వీటిల్లో కొన్ని రికార్డులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఎలక్ట్రానిక్ డివైస్‌లలోని డేటా, ఇతర డాక్యుమెంట్లు మాయమైన్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారమంతా తన వ్యక్తిగత పరికరాల్లోకి ప్రణీత్‌రావు కాపీ చేసుకొని హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్‌రావు - కస్టడీ రద్దు చేయాలని లంచ్‌మోషన్ పిటిషన్
హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి అడవిలో పడేసిన ప్రణీత్ రావు - నేడు వికారాబాద్ తీసుకెళ్లి విచారణ