Engineers Removed Second Boat at Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడి మునిగిన రెండో పడవను ఇంజినీర్లు తొలగించారు. నీట మునిగిన పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపి ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి వెలికితీశారు. రెండో బోటును బ్యారేజీ ఎగువన పున్నమి ఘూట్ వద్దకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో బెకెం ఇన్‌ఫ్రా ఇంజినీర్లు రెండు భారీ పడవలను ఎట్టకేలకు బయటకు తీశారు. తొమ్మిది రోజులుగా బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుగా ఉన్న మూడు పడవలను ఇంజినీర్లు, అధికారులు శతవిధాలుగా ప్రయత్నించి రెండు పడవలను వెలికితీశారు. బ్యారేజీ వద్ద ఇంకా మరో భారీ, మోస్తరు బోటును ఒడ్డుకు తరలించేందుకు అధికారులు యత్నిస్తున్నారు.
కేసుల విచారణపై ప్రభుత్వం చూసుకుంటుంది: ప్రకాశం బ్యారేజీ వద్ద 2 భారీ బోట్లు తొలగించినట్లు ప్రభుత్వ ప్రత్యేకాధికారి కె.వి.కృష్ణారావు (Government Special Officer KV Krishna Rao) తెలిపారు. రెండు బోట్లను బెకెం ఇన్‌ఫ్రా ఇంజినీర్లు నది ఒడ్డుకు తెచ్చారని అన్నారు. ప్రకాశం బ్యారేజీ 69వ గేటు వద్ద మరో భారీ బోటు తిరగబడి ఉందని వివరించారు. బోల్తా పడిన మూడో బోటును రేపు సవ్య దిశలోకి తెస్తామని అధికారి తెలిపారు. గడ్డర్లతో అనుసంధానించిన 2 పడవలతో బయటకు తెస్తామని ఒడ్డుకు తెచ్చిన పడవలను పున్నమి ఘాట్ వద్ద భారీ తాళ్లతో కట్టేస్తామని అన్నారు. బోట్లపై నమోదైన కేసుల విచారణపై ప్రభుత్వం చూసుకుంటుందని ప్రభుత్వ ప్రత్యేకాధికారి కె.వి.కృష్ణారావు తెలిపారు.
భారీ బోటు ఒడ్డుకు : గడచిన రోజున 40 టన్నల ఓ భారీ బోటును బెకెం ఇన్ ఫ్రా సంస్థకు చెందిన ఇంజనీర్లు ఎట్టకేలకు ఒడ్డుకు తెచ్చారు. బ్యారేజీ వద్ద అడ్డుపడి ఇసుక, నీరు బోటులోకి చేరడంతో సుమారు 100 టన్నుల వరకు బోటు బరువు పెరిగిందని అధికారులు తెలిపారు. బోటు బరువు భారీగా ఉండటంతో సరికొత్త విధానంతో అధికారులు పనులు చేపట్టారు. ఒడ్డుకు తెచ్చిన బోటును కిలోమీటర్ దూరంలో ఉన్న పున్నమి ఘాట్ వద్దకు చేర్చారు.
దిశ మార్చుకునే లోపే నీట మునిగిన రెండో బోటు - కొనసాగుతున్న తొలగింపు ప్రక్రియ - BOAT REMOVAL OPERATION
బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతం - ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - Prakasam Barrage Boat Incident