How to Make Sabudana Pakodi at Home : పకోడి.. ఈ రెసిపీకి ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉంటుంది. తినాలనిపించినప్పుడు, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కవ మంది దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే నిమిషాల్లో తయారవ్వడమే కాదు.. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే.. పకోడి అంటే చాలా మంది ఉల్లిపాయ, పాలకూర, పల్లీ పకోడి అంటూ రకరకాలుగా చేసుకుంటుంటారు. కానీ.. వీటితో మాత్రమే కాకుండా సగ్గుబియ్యంతో కూడా అద్దిరిపోయే పకోడి చేసుకోవచ్చు. దీని టేస్ట్ కూడా ఆనియన్ పకోడికి ఏమాత్రం తీసిపోదు. దీనిని తయారు చేయడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సగ్గుబియ్యం పకోడి రెసిపీకి కావలసిన పదార్థాలు :
- సగ్గుబియ్యం - అరకప్పు
- బంగాళదుంపలు - రెండు
- వేరుశనగ పలుకులు - పావు కప్పు
- పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు
- జీలకర్ర - అర స్పూను
- కొత్తిమీర తరుగు - పావు కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:
- సగ్గుబియ్యం పకోడి చేయడానికి ముందుగా సగ్గుబియ్యాన్ని నానపెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి.. సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తటి పొడిలాగా చేసి పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదుపుకోవాలి. అలాగే వేరుశనగ పల్లీలను దోరగా వేయించి పొట్టు తీసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఓ బౌల్లోకి ఉడికించిన బంగాళదుంపల మిశ్రమం, సగ్గుబియ్యం పొడి, వేరుశనగ పలుకులు వేసి కలపాలి.
- ఆ తర్వాత అందులోకి పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి పకోడి పిండి మాదిరి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టండి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోయండి.
- నూనె కాగిన తర్వాత సగ్గుబియ్యం, ఆలుగడ్డ మిశ్రమాన్ని మరోసారి కలిపి పకోడిల మాదిరి నూనెలో వేయాలి.
- ఫ్లేమ్‌ను మీడియంలో పెట్టి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం పకోడిలు రెడీ.
- నచ్చితే మీరూ ట్రై చేయండి. వీటికి గ్రీన్ చట్నీ కాంబినేషన్ మరో లెవల్ లో ఉంటుంది.
యమ్మీ యమ్మీగా "ఆలూ 65" - ఇలా చేశారంటే టేస్ట్ మరో లెవల్!
పప్పులు, పెరుగు, సోడా ఏదీ వద్దు - బియ్యంతోనే "కమ్మటి చిట్టి పునుగులు" ఇలా చేయండి!
ఈవెనింగ్ స్నాక్స్‌గా "ఉల్లి వడలు" - ఇలా ప్రిపేర్ చేశారంటే పకోడిని మించిన టేస్ట్!