ETV Bharat / technology

CNG క్రేజ్ మామూలుగా లేదుగా.. సేల్స్​లో టాప్ గేర్​లో దూసుకుపోతున్న హ్యుందాయ్!

ప్రత్యర్థి కార్లకు చుక్కలు.. భారీ సేల్స్​తో అదరగొట్టిన హ్యుందాయ్!

Hyundai CNG car
Hyundai CNG car (Hyundai Motor India)
author img

By ETV Bharat Tech Team

Published : 2 hours ago

Hyundai Records in CNG Car Sales: హ్యుందాయ్ మోటార్ ఇండియా CNG కార్లు సేల్స్‌లో అదరగొట్టాయి. ఇది వరకూ లేని విధంగా వీటి సేల్స్ అక్టోబర్‌ నెలలో గణనీయంగా పెరిగాయి. డ్యూయల్‌ సిలిండర్‌ టెక్నాలజీతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌, ఆరా, నియోస్‌ కార్లు రికార్డు స్థాయిలో మంచి సేల్స్‌ని రాబట్టాయి.

దీనికి కారణం ఈ సెగ్మెంట్​లో డిమాండ్​తో పాటు కంపెనీ ఎంట్రీ-లెవల్ CNG మోడల్‌ల పోర్ట్‌ఫోలియో కూడా. కంపెనీ ఇటీవలే గ్రాండ్ i10 నియోస్, ఎక్సెటర్‌లలో డ్యూయల్ CNG సిలిండర్ సెటప్‌ను పరిచయం చేసింది. ఆ తర్వాత రెండు మోడల్స్ సేల్స్ భారీ స్థాయిలో నమోదు చేసుకున్నాయి. ఎందుకంటే ఇది మెరుగైన బూట్ స్పేస్, అధిక ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.

గ్రాండ్ i10, ఎక్సెటర్ మాత్రమే కాకుండా, హ్యుందాయ్ కంపెనీ.. తన ఆరాను CNG పవర్‌ట్రైన్‌తో అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో (ఏప్రిల్-అక్టోబర్) హ్యుందాయ్ సేల్స్ వాల్యూమ్​లో CNG మోడల్స్ 12.8% వాటాను కలిగి ఉన్నాయి. పుణే, దిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో హ్యుందాయ్ CNG మోడల్స్​కు డిమాండ్ భారీగా పెరిగింది.​ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హ్యుందాయ్ మొత్తం అమ్మకాలలో CNG వాహనాల వాటా 11.4%. గ్రామీణ మార్కెట్లలో వాటి వాటా గత కొద్ది సంవత్సరాల్లోనే 12%కి అనూహ్యంగా వేగంగా పెరిగింది. అయితే పట్టణ మార్కెట్లలో దీని వాటా 10.7% మాత్రమే.

అక్టోబర్​లో నమోదు చేసుకున్న సేల్స్​లో 'గ్రాండ్ i10 నియోస్' CNG 17.4%, ఎక్సెటర్ 39.7%, ఆరా 90.6% వాటాను కలిగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా CNG స్టేషన్ల సంఖ్య మరింత పెరగడంతో CNG మోడల్స్​కు గిరాకీ మరింత పెరిగింది. మన దేశంలో ఇప్పటికే 7,000 కంటే ఎక్కువ CNG స్టేషన్లు ఉన్నాయి. 2030 నాటికి దాదాపు 17,500 సిఎన్‌జి స్టేషన్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇది సిఎన్‌జికి డిమాండ్‌ను మరింత పెంచుతుందని హ్యుందాయ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ అన్నారు.

ఇదిలా ఉండగా ఇండియాలో సీఎన్‌జీ కార్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. మంచి మైలేజీ, తక్కువ మెయింటైనెన్స్, కాలుష్య రహితంగా సీఎన్‌జీ కార్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంతో కస్టమర్లను CNG కార్లపై మొగ్గు చూపిస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి టాప్‌లో కొనసాగుతోంది. దీని మార్కెట్ వాటా దాదాపు 72%.

స్టన్నింగ్ లుక్​తో పాటు అదిరే ఫీచర్లతో హానర్ మొబైల్స్- చూస్తే కొనకుండా ఉండలేరుగా..!

ఇట్స్​ టైమ్​ టు ప్లే- 'బ్లాక్ ఫ్రైడే సేల్‌'లో మొదలైన ఆఫర్ల హంగామా- గేమింగ్ లవర్స్​కు ఇక పండగే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.