ETV Bharat / state

పంజా విసురుతున్న చలి - ఆ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలో గజగజ వణికిస్తున్న చలి - రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు

Increased Heavy Cold Intensity Drastically In Telangana
Increased Heavy Cold Intensity Drastically In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 12:11 PM IST

Increased Heavy Cold Intensity Drastically In Telangana : తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి పూటే కాదు మిట్ట మధ్యాహ్నమూ ఈదురు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు : శనివారం రాత్రి సిర్పూర్ (యు)లో 9.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలో కెరమిరి, వాంకిడి, ధనోరా, తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్, భీంపూర్, బోథ్, బేల, ఆదిలాబాద్‌ గ్రామీణం, నేరడిగొండ, మావల మండలాలు చలితో వణికిపోతున్నాయి. మధ్య తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కూడా గజగజమంటోంది. కోహీర్‌లో అత్యల్పంగా 9.9 డిగ్రీలు నమోదైంది.

తెలంగాణవైపు గాలులు : గుమ్మడిదల, కంగ్టి, న్యాల్‌కల్, అందోలు, పుల్కల్, జహీరాబాద్, మునిపల్లి మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. చలి ఎక్కువగా పెడుతుండటంతో పాడి రైతులు తమ పశువులను రాత్రి వేళలో నెగళ్ల వద్ద కట్టేస్తున్నారు. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా తగ్గుముఖం పట్టాయి. రామగుండం, మహబూబ్‌నగర్​లో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు, వరంగల్​లో 2.6 డిగ్రీలు, హైదరాబాద్‌లో 1.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గాయి. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణవైపు గాలులు వీస్తుండటమే రెండు రోజులుగా రాష్ట్రంలో శీతల వాతావరణం ఏర్పడటానికి కారణమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

ఓ వైపు చలి.. మరోవైపు పొగమంచు.. జర జాగ్రత్త సుమా..!

మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ : రాష్ట్రంలో రానున్న మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్‌ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నాయని సూచిస్తూ ఈ జిల్లాలకు ఆరెంజ్‌ రంగు హెచ్చరికలు జారీ చేసింది. 30 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. వీటికి ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : తెలంగాణ రాష్ట్రంలో ఆరెంజ్, పసుపు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, వ్యాధులతో బాధపడుతున్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని తెలిపింది. మధ్యాహ్నం సమయంలోనే రాకపోకలు సాగిస్తే మంచిదని సూచించింది. ఏజెన్సీ ప్రాంతాల వారు వెచ్చని వాతావరణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చలితో పాటు ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.

ఏటా డిసెంబరులో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోతాయి. ఈ సంవత్సరం కొన్ని జిల్లాల్లో నవంబరులోనే ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితి నెలకొంది. గత పది సంవత్సరాలతో పోల్చితే ఈ నెల 23వ తేదీ రాత్రి నాలుగు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 12 డిగ్రీలు, హనుమకొండలో 12.9, మహబూబ్‌నగర్‌లో 13.4, నల్గొండలో 13.6 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

అల్లూరిలో చలి పులి.. మూగజీవాలు సైతం గజగజ.. చలిమంటలతో ఉపశమనం

Temperatures dropped in Hyderabad: రాబోయే రోజుల్లో చలి మరింత తీవ్రం.. హెచ్చరించిన ఐఎండీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.