ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా రామోజీరావుకు నివాళులర్పించిన గ్రూపు సంస్థల ఉద్యోగులు - Employees Condolence meetings - EMPLOYEES CONDOLENCE MEETINGS

Employees Organized Condolence Meeting for Ramoji Rao in Across the State : అక్షర యోధుడు రామోజీరావు అక్షరాలనే లక్షణాలుగా మలచి లక్షలాది మందికి ఉపాధి కల్పించారని రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది కొనియాడారు. రాష్ట్రంలో పలుచోట్ల రామోజీ సంస్మరణ సభలు నిర్వహించారు. తెలుగు పాత్రికేయానికి రామోజీరావు ఉషోదయంతో ఊపిరులూదారని వక్తలు ప్రశంసించారు. అక్షర తపస్వి, విజయాల యశస్వి సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Employees Organized Condolence Meeting for Ramoji Rao in Across the State
Employees Organized Condolence Meeting for Ramoji Rao in Across the State (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 10:27 PM IST

Employees Organized Condolence Meeting for Ramoji Rao in Across the State : అక్షర యోధుడు రామోజీరావు అక్షరాలనే లక్షణాలుగా మలచి లక్షలాది మందికి ఉపాధి కల్పించారని రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది కొనియాడారు. రాష్ట్రంలో పలుచోట్ల రామోజీరావు సంస్మరణ సభలు నిర్వహించారు. అక్షర తపస్వి, విజయాల యశస్వి సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ, మచిలీపట్నం, విజయవాడల్లో మార్గదర్శి కార్యాలయ సిబ్బంది రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించి మౌనం పాటించారు. ఆయన వేసిన ప్రతి అడుగూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. విజయవాడలోని ప్రియా ఫుడ్స్‌లో సంస్థ ఛైర్మన్‌ రామోజీరావుకు ఉద్యోగులు ఘన నివాళులు అర్పించారు.

రామోజీరావుతో అనుబంధం నాకెంతో అపురూపం - ఆ ఫొటోలు చాలా ప్రత్యేకం : వెంకయ్యనాయుడు

గుంటూరులోని ఈనాడు యూనిట్‌ కార్యాలయం, మార్గదర్శి ఆఫీసుల్లో రామోజీరావు సంస్మరణ సభలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి సిబ్బంది పాల్గొని ఛైర్మన్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒంగోలు ఈనాడు యూనిట్‌ కార్యాలయంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొని రామోజీరావు సేవలను గుర్తు చేసుకున్నారు. కర్నూలు ఈనాడు యూనిట్ కార్యాలయంలో ఈనాడు- ఈటీవీ సిబ్బంది రామోజీరావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. తిరుపతి మార్గదర్శి కార్యాలయంలో నిర్వహించిన సంస్మరణ సభలో రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, మార్గదర్శి ఖాతాదారులు రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రామోజీరావు ఆశయాలను, సిద్ధాంతాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

విశాఖ ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి, ప్రియ సంస్థల సిబ్బంది నివాళులర్పించారు. అనంతపురంలోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో జిల్లాలోని సిబ్బంది పాల్గొని రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు.

'రామోజీరావు రియల్ హీరో- మనందరికీ ఆయన అన్నదాతే'- రాజస్థాన్, కర్ణాటకలో అక్షర యోధుడికి పాత్రికేయుల నివాళి

రామోజీరావు ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ కొనియాడారు. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. సమాజానికి రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆటోనగర్‌లో పేదలకు అన్నదానం చేశారు.అలాగే0 శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్‌ పాల్గొని అక్షరయోధుడి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువులు రక్తదానం చేశారు. పత్రికా రంగానికి రామోజీరావు శోభ తెచ్చారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్‌ కొనియాడారు. తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో రామోజీరావు చిత్రపటానికి పాత్రికేయులతో కలసి చింతామోహన్‌ నివాళులర్పించారు.

అక్షర యోధుడు, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని రామోజీఫిల్మ్‌సిటీలో నిర్వహించారు. రామోజీరావు కుటుంబసభ్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సంస్థలో పనిచేస్తున్న వివిధ విభాగాల్లోని సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామోజీ చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.

'రామోజీరావు వ్యక్తి కాదు ఓ వ్యవస్థ- సమాజానికి ఆయన మార్గదర్శి' - tdp Leaders Tribute to ramoji Rao

అక్షర యోధుడికి ఘన నివాళులు - రాష్ట్ర వ్యాప్తంగా రామోజీరావుకు నివాళులర్పించిన గ్రూపు సంస్థల ఉద్యోగులు (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.