Falling a Sleep in Daytime at Office : కొంతమంది ఉద్యోగినులకు ఆఫీసులో నిద్ర ముంచుకొస్తుంటుంది. మరికొందరికైతే కాస్త అన్నం తినగానే ఆవలింతలు మొదలై మత్తుగా ఉంటుంది. అయితే ఎందుకిలా ఉంటుందో తెలుసా? మరి దీన్నెలా అదుపు చేసుకోవాలో చూద్దాం. మధ్యాహ్నం భోజనం తరవాత మన శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగి రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువ అవుతాయి. ఇది నిద్రపోయే హార్మోన్లు సెరటోనిన్, మెలటోనిన్‌ను పెంచుతుంది. దీంతో కాస్త మగతగా అనిపిస్తుంది. సో ఇలాంటప్పుడు తిన్న వెంటనే మనం పనిలో నిమగ్నం కాకుండా, కాస్త అటూ ఇటూ నడవాలి. లేదా మెట్లెక్కి దిగండి.
శరీరానికి తగినన్ని నీళ్లు అందనప్పుడు కూడా అలసటకు గురవుతుంది. ఇది కూడా నిద్రకూ కారణం అవ్వొచ్చు. ఎప్పుడైనా కళ్లు మూతలు పడుతున్నాయంటే ఓ గ్లాస్ వాటర్ తాగి చూడండి. శరీరానికి శక్తినిచ్చే ఆహారం తీసుకోకపోయినా నిద్ర ముంచుకొస్తున్నట్లు అనిపిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి ఈ సమస్య వస్తుందంటే మీరు నిస్సత్తువతో ఉన్నట్లే మరి. ఈ పరిస్థితి అదుపులోకి రావాలంటే గుప్పెడు నట్స్, సీడ్స్‌ను డబ్బాలో వేసుకుని వెంట తీసుకెళ్లండి.
గాఢ నిద్ర లేకపోవడమే ప్రధాన కారణం : మీరు తీసుకునే ఆహారంలో ఐరన్, ప్రొటీన్లు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవే మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి మరి. అయితే పగటి పూట నిద్ర వెంటాడటానికి మరో కారణం కూడా ఉంది. అదే రాత్రిళ్లు మీకు గాఢ నిద్ర లేకపోవడమే. ఇందుకు పని వేళలు, గ్యాడ్జెట్స్ కారణం ఏదైనా సరే వాటిని నియంత్రించండి. కనీసం 6 గంటలైనా ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోండి. ఇది మీ సమస్యను అదుపులో ఉంచుతుంది.
18-60 సంవత్సరాలు ఏజ్ ఉన్నవాళ్లు ఓ దశలో నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, ఇలా పలు కారణాల వల్ల వారు నిద్రకు దూరమవుతారు. ఈ దశలో వీరు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. దానితో పాటు కాస్త వ్యాయామం లేదా యోగా చేస్తే ఇంకా మంచిది.
హాయిగా నిద్రపోవాలంటే - ఈ ఆహారాలు మీ లిస్ట్‌లో ఉండాల్సిందే! - Best Foods to reduce Sleeplessness
గుడ్ స్లీప్, ఫుల్ ఖుషీ! ఏ టైంలో స్నానం చేస్తే సుఖంగా నిద్రపోవచ్చో తెలుసా? - Showering Before Bed