ETV Bharat / state

నల్లమలలో బ్రేకులు లేకుండా ప్రయాణం - 30 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్‌ కారిడార్‌!

హైదరాబాద్‌ టూ శ్రీశైలం మధ్య ఎలివేటెడ్‌ కారిడార్‌ - 24 గంటలు సాగనున్న రాకపోకలు - ప్రతిపాదించిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ

Elevated Corridor in Hyderabad to Srisailam Highway
Elevated Corridor in Hyderabad to Srisailam Highway (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Elevated Corridor in Hyderabad to Srisailam Highway : నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా దృష్టి సారించింది. హైవేలో మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు రోడ్డు విస్తరణ కోసం 147.31 హెక్టార్లు భూమి అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు మీదుగ ఉన్న నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు రాష్ట్ర అటవీశాఖతో సమావేశమయ్యారు.

రోడ్డు విస్తరణ ప్రాజెక్టు గురించి వారికి వివరించారు. అరణ్యభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో అటవీశాఖ నుంచి పీసీసీఎఫ్‌ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) ఆర్‌.ఎం.డోబ్రియల్‌, పీసీసీఎఫ్‌ (వైల్డ్‌లైఫ్‌) ఎలూసింగ్ మేరు, పలువూరు హాజరయ్యారు. హైవే -756లో హైదరాబాద్‌ - శ్రీశైలం సెక్షన్‌ మధ్య ప్రస్తుత ట్రాఫిక్‌, రానున్నకాలంలో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకొని 2 వరుసల 4 లేన్లుగా విస్తరించే ప్రణాళికను వారికి వివరించారు. వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తామని మిగతాచోట భూభాగంలోనే రోడ్డును విస్తరిస్తామని పేర్కొన్నారు. ఎలివేటెడ్‌ కారిడార్‌ దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌-శ్రీశైలం మార్గంలో 128.6 కి.మీ. నుంచి 191 కి.మీ. వరకు రోడ్డువిస్తరణ ప్రాజెక్టును ప్రతిపాదించారు.

అటవీ భూమి కావాలని ప్రతిపాదన : మన్ననూరుకు ముందున్న బ్రాహ్మణపల్లి ప్రాంతం నుంచి పాతాళగంగ వరకు తెలంగాణ పరిధిలో వరకు జాతీయ రహదారిని విస్తరణ చేపడతారు. పాతాళగంగ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వస్తుంది. తెలంగాణలో 62.5 కి.మీ. మేర రహదారిని విస్తరించాలన్నది ప్రణాళిక కాగా ఇందులో 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అటవీశాఖకు వివరించారు. రోడ్డు విస్తరణకు అవసరమయ్యే భూమి విషయమై అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేసి నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో అటవీ భూమి కావాలని అధికారులు అటవీశాఖకు తెలిపారు.

నాగార్జునసాగర్ టూ శ్రీశైలం 'లాంచీ ప్రయాణం' షురూ - టికెట్ ధరలు సహా పూర్తి వివరాలివే

వారి మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలి : ప్రతిపాదనలు ప్రాథమికస్థాయిలో ఉన్నాయని అవి అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ఈటీవీ భారత్‌కు తెలిపారు. ప్రస్తుతం ఈ మార్గంలో మన్ననూరు చెక్‌పోస్టు నుంచి దోమలపెంట చెక్‌పోస్టు మధ్య రాకపోకలను రాత్రి 9 నుంచి ఉదయం 6వరకు అటవీశాఖ అనుమతించడం లేదు. రాత్రివేళలో వణ్యప్రాణులు తిరగేదాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని అమలు చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మిస్తే ఎలివేటెట్‌ కారిడార్‌ మీదుగా వాహనాలు 24గంటలు రాకపోకలు సాగించవచ్చని అధికారులు వివరించగా, ఫ్లై ఓవర్‌ మార్గమధ్యంలో వాహనాలు ఎక్కి, దిగేలా ర్యాంపులు నిర్మించవద్దని అటవీశాఖ స్పష్టం చేసినట్లు సమాచారం.

లైటింగ్‌ అధికంగా ఉంటే వణ్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని ఎలివేటెట్‌ కారిడార్‌పై రాత్రివేళ తక్కువ లైటింగ్ ఉండేవిధంగా ఏర్పాట్లు చేయాలని నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ బోర్డు మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. కేంద్ర ఉపరితల రవాణా, ఎన్‌హెచ్‌ఐ అధికారులు ప్రెజంటేషన్‌ విన్న అటవీ అధికారులు పలు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. నల్లమల అటవీ ప్రాంతం అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో ఎక్కువ చెట్లు కొట్టివేయకుండా తక్కువ నరికేలా చూడాలని రోడ్లు విస్తరణ ప్రణాళికలో పలు మార్పులు చేర్పులు సూచించినట్లు సమాచారం.

ప్రతిపాదిత ప్రాజెక్టు వివరాలు
మొత్తం దూరం62.5 కి.మీ
అటవీ ప్రాంతంలో 56.2 కి.మీ
అటవీయేతర ప్రాంతంలో 6.3
ఘాట్‌ ఎంత?
ఘాట్‌ సెక్షన్‌ రోడ్డు విస్తరణ14.6 కి.మీ
భూభాగంపై విస్తరించే మార్గం47.9 కి.మీ
ఎంత భూమీ కావాలి?
అటవీ ప్రాంతం128.63 హెక్టార్లు
అటవీయేతర ప్రాంతం18.68 హెక్టార్లు

భక్తులకు 'దారి' చూపిస్తున్న మల్లన్న - హైదరాబాద్​ - శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై ఓవర్! - Elevated Corridor Srisailam Highway

శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం - ఒకేసారి వందల బోట్లతో మత్స్యకారుల చేపల వేట - Fishermen Hunting at Srisailam

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.