Election Commission Transferred DGP : ఏపీలో ఎన్నికల దృష్ట్యా ఆ రాష్ట్ర డీజీపీపై ఎన్నికల సంఘం వేటు వేసింది. విపక్షాల ఫిర్యాదుల మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని తెలిపింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ తెలిపింది. సోమవారం ఉదయం 11లోగా కొత్త డీజీపీ ఎంపిక జాబితా పంపాలని ఈసీ ఆదేశించింది.
Election Commission Fire on AP DGP : ఏపీ డీజీపీ వైఎస్సాఆర్‌సీపీరు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. డీజీపీను, ఈసీను మార్చాలంటూ గత కొన్ని రోజులుగా విపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఈసీకు ఫిర్యాదు వస్తున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ఈసీ డీజీపీను బదిలీ చేసింది. మరో వైపు టీడీపీ నాయకులు డీజీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ సేవలో తరించడమే డీజీపీ డ్యూటీగా మారిపోయిందని వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఒక్కసారి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన నమ్మకం కలిగించలేకపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
AP DGP History : గతంలో డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను పక్కనపెట్టేసి మరీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జీ డీజీపీగా ఏపీ ప్రభుత్వం నియమించింది. రెండేళ్లుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగించింది. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంశాఖ పదే పదే లేఖలు రాసినా ఖాతరు చేయలేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయలేదు.
రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్ అధికారైన ఆయన అదనపు డీజీపీ నుంచి డీజీపీ హోదాకి పదోన్నతి పొందిన కొద్ది రోజుల్లోనే పోలీసు దళాల అధిపతిగా నియమిస్తూ 2020 ఫిబ్రవరి 15న జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ఆకస్మికంగా, అర్ధాంతరంగా ఆ పోస్టు నుంచి పక్కకు తప్పించి ఆ స్థానంలో ఇన్‌ఛార్జి డీజీపీగా ఆయనను ఏపీ ప్రభుత్వం నియమించింది.