ETV Bharat / state

హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం - ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు - Election Campaign in AP - ELECTION CAMPAIGN IN AP

Election Campaign in AP : సార్వత్రిక ఎన్నికల్లో పోటికి సిద్ధమైన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ప్రచారం జోరును పెంచారు. ఇంటింటికి తిరిగుతూ తమకు ఓట్లు వేయవలసిందిగా ఓటర్లును అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ర్యాలీలు, రోడ్​షోలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

election_campaign
election_campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 9:32 AM IST

హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం - ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు

Election Campaign in AP : ఎన్నికల సమయం దగ్గర పడటం, ప్రత్యర్థులు ఎవరనేది తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతున్నారు. ర్యాలీలు, సమావేశాలతో జనాన్ని సంఘటితం చేస్తున్నారు.

Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం ప్రచార జోరు పెంచింది. బూర్జ మండలం డొంకలపర్తిలో ఆమదాలవలస అసెంబ్లీ అభ్యర్థి కూన రవికుమార్ ఇంటింటి ప్రచారం చేశారు. తెలుగుదేశం సూపర్ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. విజయనగరం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం అభ్యర్థులు ప్రచారాలు చేపట్టారు. కురుపాం నియోజకవర్గంలో తోయక జగదీశ్వరీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

పార్వతీపురంలో విజయ్ చంద్ర, సాలూరులో గుమ్మడి సంధ్యారాణి ప్రచారం చేశారు. రాజాంలో కూటమి అభ్యర్ధి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో శివ్వాం గ్రామానికి చెందిన 25 ఎస్సీ కుటుంబాలు, రేగిడి మండలం సోమరాజు పేట గ్రామానికి చెందిన 60 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. గజపతినగరంలో కొండపల్లి శ్రీనివాసరావు, బొబ్బిలిలో బేబినాయన ప్రచారం చేశారు. అటు వైసీపీ అభ్యర్థులు సైతం జోరుగా ప్రచారం సాగించారు. సాలూరులో మంత్రి పీడిక రాజన్నదొర, బొబ్బిలిలో చిన అప్పలనాయుడు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. రహదారి దుస్థితిపై డొంగురువలసకు చెందిన మహిళలు శంబంగి అప్పలనాయుుడిని నిలదీశారు.

కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల పింఛన్‍: చంద్రబాబు - Chandrababu Tour In Kuppam

Eluru District : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చింతలపూడి తెలుగుదేశం అభ్యర్థి రోషన్‌ కుమార్ ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆయనకు హారతులిస్తూ స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలో తెలుగుదేశం లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, తెనాలి శ్రావణ్‌ కుమార్ రోడ్ షో నిర్వహించారు. తాడికొండ మండలానికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు పెమ్మసాని సమక్షంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరారు.

ఏలూరును అభివృద్ధే నా లక్ష్యం- టీడీపీ నేత పుట్టా మహేశ్​ యాదవ్​ - MP Candidate Putta Mahesh Yadav

Kurnool District : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటికీ ప్రచారం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. కర్నూలు శ్రీరాంనగర్‌లో టీజీ భరత్‌కు స్థానికులు బ్రహ్మరథంపట్టారు. ఒక్క ఓటు అయిదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అందుకే నిస్వార్థంగా పనిచేసే ప్రజానాయకుడిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

జగన్ ఓట్ల దొంగ - గత ఎన్నికల్లో కుట్ర చేసి గెలిచారు: నారా లోకేశ్ - Nara Lokesh Campaign In Tadepalli

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.