ETV Bharat / state

Eenadu@50 : అభాగ్యుల పెన్నిధి - దేశమంతటా మానవత్వ పరిమళాలు వెదజల్లిన 'ఈనాడు' - Eenadu Golden Jubilee Celebrations - EENADU GOLDEN JUBILEE CELEBRATIONS

Eenadu Golden Jubilee Celebrations : వార్తా పత్రిక సైనికుడి పాత్రకే పరిమితం కాకూడదు! ఉద్యమాల్లో శూన్యాన్ని భర్తీ చేయడానికి, విపత్తులలో ఆదుకోవడానికి, అవసరమైతే నాయకత్వ బాధ్యతా స్వీకరించాలి. ఈనాడు నినాదమూ, విధానమూ ఇదే! ఈనాడు అక్షరాలు ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోస్తాయి! దిక్కులేనప్పుడు దారి చూపిస్తాయి. పౌరులు బాధల్లో ఉంటే మానవత్వం పంచుతాయి! ఆకలితో అలమటిస్తుంటే అన్నం పెడతాయి! కట్టుబట్టలతో మిగిలిన వారికి నీడ కల్పిస్తాయి. కేవలం అక్షరాలతోనే కాదు, కోట్ల రూపాయల సహాయ నిధితో అభాగ్యుల పెన్నిధిగా నిలిచింది ఈనాడు!

Eenadu 50 Years Celebrations
Eenadu 50 Years Celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 6:01 AM IST

Updated : Aug 9, 2024, 9:45 AM IST

Eenadu 50 Years Celebrations : ఈనాడు దృష్టిలో సమకాలీన వార్తల ప్రచురణే కాదు, సామాజిక బాధ్యత కూడా పత్రికల కర్తవ్యమే! ఐదు దశాబ్దాల ప్రస్థానంలో ఈనాడు అక్షరంలోనే కాదు, ఆచరణలోనూ అదే చిత్తశుద్ధి చాటుకుంటోంది. అది 1976 ఈనాడు పుట్టి అప్పటికి రెండేళ్లే! వరుసపెట్టి మూడు తుపాన్లు తెలుగునేలను కన్నీటిలో ముంచాయి. లక్షల ఎకరాల్లో పంటల్ని ఉడ్చేశాయి. సర్వం కోల్పోయిన అసంఖ్యాక ప్రజల ఆర్తనాదాలకు ఈనాడు చలించింది. ఆరోజుల్లోనే పదివేల రూపాయలతో తుపాను బాధితుల సహాయ నిధి ప్రారంభించింది. శక్తిమేరకు సాయం చేయాలంటూ ప్రజలనూ అర్థించింది. ఈనాడు పిలుపుతో తెలుగు పాఠకులు పెద్దమనసు చాటారు. నెల రోజుల్లో 64 వేల 756 రూపాయల విరాళాలు పోగయ్యాయి. ఆ మొత్తాన్నీ ప్రభుత్వానికి అందించింది ఈనాడు.

Eenadu@50 : అభాగ్యుల పెన్నిధి - దేశమంతటా మానవత్వ పరిమళాలు వెదజల్లిన 'ఈనాడు' (ETV Bharat)

ఆ గ్రామానికి పునరుజ్జీవం పోసిన ఈనాడు: 1977లో దివిసీమ ఉప్పెన బాధితులు తరతరాలూ గుర్తుంచుకునే సాయం చేసింది ఈనాడు. ఆనాటి జలప్రళయంలో వేల మంది జలసమాధికాగా తినడానికి తిండి, కట్టుకోడానికి బట్టల్లేక రోడ్డున పడినవారందరో! వారిని ఆదుకునేందుకు 25 వేల రూపాయలతో సహాయ నిధి ప్రారంభించింది. ఈనాడు పిలుపునకు పాఠకుల పెద్దమనసు తోడై, మొత్తం 3 లక్షల 73 వేల 927 రూపాయలు పోగైంది. ఆ డబ్బు నాటి ఉప్పెనలో శిథిలమైన పాలకాయతిప్ప గ్రామానికి పునరుజ్జీవం పోసింది. రాష్ట్ర ప్రభుత్వం, రామకృష్ణ మిషన్‌ సహకారంతో 112 ఇళ్లు కట్టించింది. ఆ మత్స్యకార గ్రామానికి పరమహంసపురమని కొత్త పేర పెట్టింది! ఆ గ్రామ పునర్నిర్మాణానికి ఖర్చు చేయగా మిగిలిన సొమ్ముతో కోడూరు సమీపంలోని కృష్ణాపురంలో మరో 22 ఇళ్లు కట్టించారు.

ETV Bharat
ఆపద సమయాల్లో ప్రజలకు అండగా ఈనాడు (ETV Bharat)

1986లో గోదావరి జిల్లాల కన్నీరు తుడిచింది ఈనాడు! ఆనాటి వరదల్లో ఆకలికేకలతో అలమటించిన బాధితులకు అన్నపానీయాలు అందించింది. 50 వేల మందికి ఆహార పొట్లాలు అందజేసింది. విశాఖలోని డాల్ఫిన్‌ హోటల్స్‌ ప్రాంగణంలో ఆహారం వండించి గ్రూప్‌ ఉద్యోగుల ద్వారా బాధితులకు చేరవేయడం ఈనాడు మానవత్వానికి మచ్చుతునకగా ప్రశంసలందుకుంది.

ప్రజల కష్టాలపై తల్లడిల్లిన ఈనాడు: 1996 అక్టోబర్‌లో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో, నవంబర్‌లో గోదావరి జిల్లాల్లో తుపాన్‌ విధ్వంసం సృష్టించింది. ప్రజల కష్టాలపై తల్లడిల్లిన ఈనాడు, 25 లక్షల రూపాయలతో సహాయ నిధి ప్రారంభించింది. దయార్థ్రహృదయాలూ చేతులు జోడించడంతో మొత్తం కోటి 60 లక్షల రూపాయలు పోగైంది. ఈ నిధులు వరద బాధితుల్లో అత్యధిక మందికి ఉపయోగపడాలని సంకల్పించింది ఈనాడు. మామూలు రోజుల్లో బడుల్లా తుపాన్ల సమయాల్లో పునరావాస శిబిరాలుగా ఉపయోగపడేలా సూర్య భవనాలు నిర్మించింది. ఏఏ గ్రామాల్లో భవనాలు అవసరమో 'ఈనాడు' బృందాలు శోధించి రెండు నెలల్లోనే 60 గ్రామాల్లో నిర్మాణాలు పూర్తిచేయించాయి. ఈనాడు స్ఫూర్తితో దాతలు కూడా సిమెంట్‌, ఇనుము, మెటల్‌, ఇసుక సమకూర్చి దాతృత్వం చాటుకున్నారు.

హుద్‌హుద్‌ తుపాను బాధితుల కోసం సాయం: 2009 అక్టోబర్‌లో కృష్ణ, తుంగభద్ర, కుందూనదుల మహోగ్రరూపానికి కకావికలమైన కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల కన్నీళ్లు తుడిచింది ఈనాడు. తక్షణ సాయంగా లక్షా 20 వేల ఆహార పొట్లాలు పంపిణీ చేసి బాధితుల ఆకలి తీర్చింది. కోటి రూపాయలతో సహాయ నిధి ఏర్పాటు చేసింది. దాతల విరాళాలతో 6 కోట్ల 5 లక్షల 58 వేల 662 రూపాయలు పోగయ్యాయి. ఆ డబ్బుతో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1110 చేనేత కుటుంబాలకు మగ్గాలు అందజేసింది. కర్నూలు జిల్లాలో 'ఉషోదయ పాఠశాల భవనాలు' నిర్మించి ప్రభుత్వానికి అప్పగించింది ఈనాడు. 2014 అక్టోబరు 12న ఉత్తరాంధ్ర వెన్ను విరిచిన హుద్‌హుద్‌ తుపాను బాధితుల కోసం ఈనాడు’ 3 కోట్ల సాయం ప్రకటించింది! ప్రజలు ముందుకొచ్చి మరో 3 కోట్ల 16 లక్షలు విరాళాలిచ్చారు. మొత్తం 6 కోట్ల 16 లక్షల రూపాయల సహాయనిధితో విశాఖపట్నం జిల్లా తంతడి- వాడపాలెం గ్రామంలో 80, శ్రీకాకుళం జిల్లా పాత మేఘవరంలో 36, ఉమ్మిలాడలో 28 ఇళ్లు నిర్మించింది.

Eenadu Golden Jubilee Celebrations
ఈనాడు రిలీఫ్ ఫండ్​తో నిర్మించిన భవనాలు (ETV Bharat)

పండుటాకులకు నిలువ నీడ కల్పించిన రామోజీరావు: 2020లో భారీ వర్షాలకు తెలంగాణ ప్రాంతంలో తీవ్ర నష్టం జరిగినప్పుడూ సీఎం సహాయ నిధికి ఈనాడు గ్రూప్‌ 5 కోట్ల రూపాయల విరాళం అందించింది! 2020లో కరోనా విపత్తు సమయంలో తెలుగు రాష్టాలకు విడివిడిగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పదేసి కోట్ల చొప్పున మొత్తం 20 కోట్ల రూపాయల భూరి విరాళం ఇచ్చి తెలుగు ప్రజలకు ఈనాడు ఎన్నడూ తోడుంటుందనే భరోసా ఇచ్చింది. రామోజీ ఫౌండేషన్ ద్వారా కృష్ణా జిల్లా పెదపారుపూడి, రంగారెడ్డి జిల్లా నాగన్‌పల్లి గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దింది! మంచిర్యాల, భద్రాచలం, కర్నూలులో 5 కోట్ల రూపాయలతో వృద్ధాశ్రమాలు నిర్మించి పండుటాకులకు నిలువ నీడ కల్పించారు రామోజీ గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీరావు.

ఒడిశాకూ ఆపన్న హస్తం: తెలుగు నేలపై సాయం చేసినట్లే 1999లో తుపాను గాయంతో తల్లడిల్లిన ఒడిశాకూ ఆపన్న హస్తం అందించింది ఈనాడు. తన వంతుగా 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. పాఠకులు, దాతల స్పందనతో 45 లక్షల 83 వేల 148 రూపాయలు పోగయ్యాయి. ఆ డబ్బుతో రామకృష్ణా మిషన్ ద్వారా జగత్సింగ్‌పూర్‌ జిల్లా కోనాగుల్లి గ్రామంలో 60 పక్కా గృహాలు కట్టించారు. 2001లో భూకంపంతో భీతిల్లిన గుజరాత్‌కూ 25 లక్షల రూపాయలతో ఈనాడు సహాయ నిధి ప్రారంభించింది.

మానవతామూర్తుల విరాళాలతో 2 కోట్ల 22 లక్షలు పోగయ్యాయి. వాటితో స్వామి నారాయణ్‌ ట్రస్ట్‌ ద్వారా 104 ఇళ్లు నిర్మించి నిరాశ్రయులకు నీడనిచ్చింది ఈనాడు. 2004లో సునామీ బీభత్సంతో తల్లడిల్లిన తమిళనాడుకూ ఈనాడు తోడుగా నిలిచింది. 25 లక్షల రూపాయలతో సహాయ నిధి ప్రారంభించింది. మనసున్న మారాజుల స్పందనతో అది రెండున్నర కోట్ల రూపాయలైంది. రామకృష్ణ మఠం సహకారంతో కడలూరు జిల్లా వడుక్కు ముడుసల్‌ ఒడై గ్రామంలో 104 ఇళ్లు, నాగపట్నం జిల్లా నంబియార్ నగర్‌లో 60 కుటుంబాలకు గృహయోగం కల్పించింది ఈనాడు!

Eenadu 50 Years Celebrations
విపత్తుల సమయంలో అండగా ఈనాడు (ETV Bharat)

Eenadu@50 : నలుచెరుగులా ఈనాడు జైత్రయాత్ర – ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు - Eenadu Golden Jubilee Celebrations

దేశమంతటా మానవత్వ పరిమళాలు: 2018లో కేరళ వరద బాధితుల సహాయం కోసం 3 కోట్ల రూపాయలతో సహాయ నిధి ప్రారంభించగా, మానవతావాదుల సహకారంతో 7 కోట్ల 77 లక్షలు పోగయ్యాయి. ఆ ‌డబ్బుతో పక్కా గృహాలు నిర్మించి, వరద బాధితులకు అండగా నిలిచింది ఈనాడు. ఒక ప్రాంతీయ పత్రికగా పుట్టి సంకుచిత భావాలు లేకుండా దేశమంతటా మానవత్వ పరిమళాలు వెదజల్లింది ఈనాడు. 1995లో ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రమదానోద్యమం, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకుండా, ప్రజల సమస్యలు ప్రజలే పరిష్కరించుకునేలా చైతన్య పరిచింది. ఈనాడు పిలుపుతో తెలుగు ప్రజలు వెల్లువలా కదిలారు. దాని ఫలితమే ఊళ్లలో రోడ్లు వెలిశాయి. వంతెనలు ప్రాణం పోసుకున్నాయి! కాలువలకు కొత్త కళ వచ్చింది!

ప్రధాని మోదీ ప్రశంసలు: ఈనాడు చేపట్టిన జలయజ్ఞం అనేక చెరువులకు జీవం పోయగా, వనయజ్ఞం నేటికీ ఎంతో మందికి నీడనిస్తోంది. వాననీటిని ఒడిసిపట్టి భూగర్భజలాల్ని కాపాడుకుందాం అని ఈనాడు 2016లో పిలుపునిచ్చింది. సుజలాం సుఫలాం కార్యక్రమంతో ఈనాడు-ఈటీవీ ప్రజాసమూహాల్ని సామాజిక సేవలో భాగస్వామ్యం చేశాయి. లక్షలాది ఇంకుడు గుంతలు తవ్వి నీటి సంరక్షణ యజ్ఞంలో చేపట్టినందుకు ప్రధాని మోదీ కూడా మన్‌కీ బాత్‌లో ప్రశంసించారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఈనాడు ప్రేరణ కలిగించింది. రామోజీరావు కృషిని కొనియాడుతూ ఆయన్ను స్వచ్ఛభారత్ అంబాసిడర్‌గా ప్రధాని మోదీ నియమించారు.

ఒక్క వార్త కష్టాలు తీరుస్తుంది. జీవితాలను తీర్చిదిద్దుతుంది. ‘ఈనాడు’ కథనాలతో కొత్త వెలగులు నిండి జీవితాలు అనేకం! ఫీజుల సమస్య తీరిన నిరుద్యోగులు, పునర్జన్మ దక్కించుకున్న ప్రాణాంతక రోగులు! కాణీ ఖర్చు లేకుండా ఖరీదైన ఆపరేషన్లు ఇలా, ఒకటేంటి? ఈనాడు చొరవతో అసాధ్యమనుకున్నవెన్నో సుసాధ్యం అయ్యాయి. వేల కుటుంబాలకు ఈనాడు అక్షరాలు వెలుగు తెచ్చాయి. ఎన్నో స్ఫూర్తిదాయక కథనాలు భావితరాలకు కొత్త ఊహలకు రెక్కలు తొడిగే ప్రేరణ ఇచ్చాయి. అభాగ్యులకు ఆసరానిచ్చే వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది రామోజీరావు నిర్దేశం. ఈనాడు పత్రికే సోపానంగా సివిల్స్‌ ర్యాంక్ కొట్టిన విజేతలు, గ్రూప్‌వన్‌ టాపర్స్‌ ఇలా తెలుగునాట ఈనాడు వెలుగు రేఖలు ప్రసరిస్తూనే ఉన్నాయి.

Eenadu@50 : తెలుగు జాతి ఆత్మాభిమానం, ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యంగా ఈనాడు అక్షర యాగం - EENADU Golden Jubilee Celebrations

Eenadu@50 : ప్రజాస్వామిక హక్కుల కోసం - 50 ఏళ్లుగా ఈనాడుది అక్షరాలా ప్రజాపక్షమే - Eenadu Golden Jubilee Celebrations

Last Updated : Aug 9, 2024, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.