Ed Involved in KTR Formula E Car Race Case : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫార్ములా ఈ-కారు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరుతూ లేఖ రాశారు. ఏసీబీ అధికారుల నుంచి వివరాలు అందగానే ఈడీ మనీలాండరింగ్ కేసును నమోదు చేయనుంది.
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసుపై సీఐయూ ఏర్పాటు - తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు
విదేశీ సంస్థకు నగదు చెల్లింపులు ఎలా జరిగాయి : ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. నాటి పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఏ2గా, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలను ఏ3గా చేర్చింది. ఈ కేసు విచారణ కోసం ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసే అవకాశముంది. హెచ్‌ఎండీఏ, రాష్ట్ర ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమంతి లేకుండానే నేరుగా విదేశీ సంస్థకు రూ.55 కోట్ల చెల్లింపులు జరిగాయి. వీటిలోనూ రూ.46 కోట్ల వరకు డైరెక్ట్‌గా డాలర్ల రూపంలో చెల్లించడం ఉల్లంఘనే అనేది కేసులో ప్రధాన అభియోగం. విదేశీ సంస్థకు నగదు చెల్లింపులు ఎలా జరిగాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేయనుంది. తాజాగా ఈడీ కేసు వివరాలను కోరుతూ ఏసీబీకి లేఖ రాశారు.
ఫార్మలా-ఈ రేస్ కేసు - హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్
'నేను ఏ తప్పు చేయలేదు భయపడేది లేదు - న్యాయపరంగా ఏం చేయాలో అది చేస్తాం : కేటీఆర్