ETV Bharat / state

శివబాలకృష్ణపై కేంద్రదర్యాప్తు సంస్థ ఫోకస్- రంగంలోకి దిగిన ఈడీ - Ex HMDA Director Shiva Balakrishna

ED Entered in Shiva balakrishna Case : హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. శివబాలకృష్ణ కేసు వివరాలు ఇవ్వాలని ఏసీబీని కోరింది. కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ఇవ్వాలని ఈడీ స్పష్టం చేసింది.

Ex HMDA Director Shiva Balakrishna Case
ED Entered in Shiva balakrishna Case
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 10:08 PM IST

Updated : Feb 8, 2024, 10:27 PM IST

ED Entered in Shivabalakrishna Case : పెద్దఎత్తున అక్రమాస్తులను కూడబెడుతూ ఏసీబీ అధికారులకు చిక్కిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ(Shiva Balakrishna Case) కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. శివబాలకృష్ణ కేసు వివరాలు ఇవ్వాలని ఏసీబీని కోరింది. కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాల వివరాలను ఇవ్వాలని ఈడీ సూచించింది.

అడ్డగోలు సంపాదనతో 214 ఎకరాల కొనుగోలు - శివబాలకృష్ణ 'అక్రమ' లీలలు అన్నీఇన్నీ కావయా!

Ex HMDA Director Shiva Balakrishna Case : శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూ.250 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను పోగుచేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో బినామీల పేరిటే 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేలింది. అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములను గుర్తించారు.

అతని పేరిట మొత్తం 29 ఇళ్ల స్థలాలు ఉండగా ఏపీలోని విశాఖపట్నం, విజయనగరంలో కూడా స్థలాలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం శివ బాలకృష్ణ నివాసముంటున్న విల్లాతో పాటు హైదరాబాద్‌లో 4, రంగారెడ్డి జిల్లాలో 3 బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్లు ఉన్నట్టు విచారణలో బయటపడింది. ఈ వ్యవహారంలో శివబాలకృష్ణకు అతని సోదరుడు నవీన్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు బినామీలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో నవీన్​ కుమార్​ ను ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

మరోవైపు శివ బాలకృష్ణ పోలీస్ కస్టడీ నిన్నటితో ముగియడంతో జ్యుడిషియల్ రిమాండ్​ కు తరలించారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఏసీబీ అధికారులు విశ్లేషించే పనిలో ఉన్నారు. వాటి ఆధారంగా మరోసారి శివ బాలకృష్ణను కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. దీనిపై న్యాయనిపుణులను కూడా సంప్రదించనున్నారు. ఇదే కేసులో శివ బాలకృష్ణను బినామీలుగా ఉన్న ఆయన సోదరుడు, మేనల్లుడిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

శివ బాలకృష్ణ అవినీతి చిట్టా బయటకు రావడంతో ఆయన బాధితులు కూడా ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గతంలో శివ బాలకృష్ణవల్ల నష్టపోయిన వారు ఏసీబీని సంప్రదించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ - రూ.250 కోట్ల పైనే ఆస్తులున్నట్లు గుర్తింపు

ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ - 15 బ్యాంకు ఖాతాల లవాదేవీలపై అధికారుల ఆరా

Last Updated : Feb 8, 2024, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.