EC Seized Money Liquor and Drugs in AP: ఎన్నికల షెడ్యూలు ప్రకటన అనంతరం ఇప్పటి వరకూ 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్ర్తో పాటు బంగారం వెండి లాంటి విలువైన లోహాలను తనిఖీల్లో పట్టుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన వివిధ చెక్ పోస్టుల్లో చేపట్టిన తనిఖీల్లో భాగంగా అక్రమంగా రవాణా చేస్తున్న నగదు, డ్రగ్స్, మద్యం, బంగారం, వెండి లాంటి లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈసీఐ (Election Commission of India) సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలు మరింత విస్తృతం చేస్తున్నామని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకుంటున్నట్టు తెలిపారు. అయితే తనిఖీల్లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సిందిగా తనిఖీ బృందాలను ఆదేశించినట్టు సీఈఓ (Chief Electoral Officer) వివరించారు.