ETV Bharat / state

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే - చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధర : భట్టి విక్రమార్క - Bhatti Campaign For Cong In Panjab

author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 7:51 PM IST

DY CM Bhatti Vikramarka On PM Modi : కాంగ్రెస్​ను చూసి బీజేపీ భయపడుతుందని, అందుకే హస్తం పార్టీ నేతల్ని టార్గెట్ చేసి మోదీ విమర్శలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశంలో వరి, పత్తి, చెరకు రైతులకు మద్దతు ధర లభించడం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ నల్లచట్టాలు తెచ్చి వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మటన్, మందిర్, మంగళసూత్రం, మైనార్టీ లాంటి అంశాలనే మోదీ మాట్లాడుతున్నారన్నారు. పంజాబ్​ రాష్ట్రంలోని ఫరీద్​కోట్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని భట్టి విక్రమార్క ప్రసంగించారు.

DY CM Bhatti Vikramarka On PM Modi
DY CM Bhatti Vikramarka On PM Modi (ETV Bharat)

DY CM Bhatti Vikramarka Campaign For Cong In Panjab : ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అన్నదాతల కష్టానికి తగిన ఫలితం రాబోయే రోజుల్లో దక్కనుందని తెలిపారు. ఆదివారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్​కోట్ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భట్టి విక్రమార్క పాల్గొని ఎన్నికల సమావేశంలో ప్రసంగించారు.

Bhatti Vikramarka Comments On Modi : దేశంలో వరి, పత్తి, చెరకు రైతులకు మద్దతు ధర లభించడం లేదని, నరేంద్ర మోదీ నల్లచట్టాలు తెచ్చి వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశంలోని నిరుద్యోగులకు అప్రెంటీస్​ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు. దేశంలోని పట్టభద్రులు, డిప్లమో చేసిన వారందరికీ ఈ హక్కు ఇవ్వబోతున్నామన్నారు. దేశంలోని పబ్లిక్ ప్రైవేటు సెక్టార్లలో సుమారు 30 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు.

నిరుద్యోగులకు ఏడాదికి లక్ష రూపాయలు : ఆగస్టు 15 లోపు ఈ ఉద్యోగాలను ఇండియా కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్శిటీలు, కళాశాలలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. కోట్లాదిమంది నిరుద్యోగులకు ఏడాదికి లక్ష రూపాయల నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. నెలకు రూ.8500 వేస్తామన్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలకు లభిస్తున్న రోజువారి కూలీలు రూ. 250 నుంచి రూ. 400 కు పెంచడంతోపాటు ఆశ అంగన్వాడీ మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లమందిని లక్షాధికారుల్ని చేస్తుంది : గత పదేళ్ల కాలంలో మోదీ 25 మందికి సంబంధించిన రూ. 16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారని భట్టి విక్రమార్క విమర్శించారు. ఆ విధంగా ఆయన 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు సరిపడా డబ్బులను వారికి ఇచ్చారు అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం 25 మందిని కుబేరుని చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాదిమంది దేశ ప్రజల్ని లక్షాధికారులని చేస్తుందని భరోసా ఇచ్చారు. మోదీ, అమిత్ షా ఆందోళనలో ఉన్నారని అభివృద్ధిని చూసి ఓటు వేయమని మోదీ అడగడం లేదని విమర్శించారు.

బీఆర్ఎస్, బీజేపీ కలిసి దేశాన్ని దోపిడీ చేయాలని చూస్తున్నాయి : మంత్రులు భట్టి, పొంగులేటి - CONGRESS ELECTION CAMPAIGN

మటన్​, మందిర్​, మంగళసూత్రం, మైనార్టీ : మటన్, మందిర్, మంగళసూత్రం, మైనార్టీతో లాంటి అంశాలనే ప్రధాని మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్​ను చూసి బీజేపీ భయపడుతుంది, అందుకే కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేసి మోదీ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల్లో ఎస్సీ, ఎస్టీలు ఎందరో చెప్పడం లేదు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రిజర్వేషన్ ప్రకారం పోస్టులు ఇస్తాం. మహిళలకు 50 శాతం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాం అన్నారు.

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 నుంచి 14 సీట్లు గెలుస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి - Deputy Cm Bhatti On MP Elections

రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్ల ఫీట్ - కాపాడాలంటే కాంగ్రెస్ రావాల్సిందే : భట్టి విక్రమార్క - BHATTI VIKRAMARKA ON RESERVATIONS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.