Dussehra Festival Wishes 2024 : దసరా పండగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని దుర్గామాతను ప్రార్థించారు. తెలంగాణ ప్రజలకు విజయదశమిని పురస్కరించుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం, అధికారులు, సిబ్బందితో కలిసి ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ ప్రజలు సుభీక్షంగా ఉండాలని దుర్గామాతను కోరుకున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దసరా పండుగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు నిత్య విజయాలు కలగాలని, ప్రజలకు ఎల్లప్పుడు సుఖసంతోషాలు ప్రసాదించాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నాని పేర్కొన్నారు.
సుఖశాంతుల తెలంగాణ
— Revanth Reddy (@revanth_anumula) October 12, 2024
సుభిక్షంగ ఉండాలి…
జన సంక్షేమానికి …
ప్రజా ప్రభుత్వ సంకల్పం
విజయపథాన సాగాలి.
విశ్వ వేదిక పై…
తెలంగాణ సగర్వంగా నిలవాలి.
ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు. #Dussehra2024 #Dussehra pic.twitter.com/WxlgheY9lo
స్వగ్రామానికి సీఎం రేవంత్ : దసరా పండగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. ప్రతి సంవత్సరం దసరా పండుగకు రేవంత్ రెడ్డి తప్పనిసరిగా తన స్వగ్రామానికి వెళ్తారు. ముఖ్యమంత్రి అయ్యాకు ఇప్పటివరకు కొండారెడ్డిపల్లికి వెళ్లలేదు. మధ్యాహ్నం తర్వాత కొండారెడ్డిపల్లికి చేరుకుని కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి పండగ వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే గ్రామంలో ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించేందుకు చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో పాటు రూ.2.17 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి శుభాకాంక్షలు : చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమని తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ...
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) October 12, 2024
రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండగ శుభాకాంక్షలు#Dussehra2024 pic.twitter.com/wCMsGsO6CE
కేసీఆర్ శుభాకాంక్షలు : దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలంటూ దుర్గామాతను ప్రార్థించారు.
కేటీఆర్ విజయదశమి శుభాకాంక్షలు : జమ్మి పూజతో నిత్య జయాలు కలగాలని, పాలపిట్ట దర్శనంతో సకల శుభాలు జరగాలని, అలయ్ బలయ్ ఆత్మీయ ఆలింగనాలు, సరదాలు సంతోషాలతో దసరా పండుగను జరుపుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు.
శమీ శమయతే పాపం..శమీ శత్రు వినాశనీ !
— KTR (@KTRBRS) October 12, 2024
అర్జునస్య ధనుర్ధారీ... రామస్య ప్రియ దర్శినీ!
జమ్మి పూజతో నిత్య జయాలు కలగాలి !
పాలపిట్ట దర్శనంతో సకల శుభాలు జరగాలి!
అలయ్ బలయ్ ఆత్మీయ ఆలింగనాలు.. సరదాలు సంతోషాలతో దసరా పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ...
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు !
Happy…
పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు : విజయానికి సంకేతంగా భావించే దసరా పండుగను రాష్ట్ర ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని కేంద్రమంతులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ప్రజలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయదశమి ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న గాథ ఏమిటి?
విజయదశమి గ్రీటింగ్స్ - మీ ఆత్మీయులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి - అమ్మవారి ఆశీస్సులు మీపైనే