ETV Bharat / state

మార్కుల మెమో పోగొట్టుకున్నారా? - ఇలా వెంటనే అప్లై చేసుకోండి! - DUPILCATE INTER MARKS MEMO IN TG

-విద్యార్థులకు కీలకంగా ఇంటర్​ మార్క్స్​ మెమో -డూప్లికేట్​ కోసం ఇలా అప్లై చేసుకోండి

How to Apply Dupilcate Inter Marks Memo Online
How to Apply Dupilcate Inter Marks Memo Online (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

How to Apply Dupilcate Inter Marks Memo Online: పదో తరగతి తర్వాత నుంచి చదివే ఉన్నత చదువులు అన్నింటికీ.. ఆయా బోర్డులు అందజేసిన మార్క్స్​ మెమోలు ఉంటాయి. తర్వాతి కాలేజీల్లో అడ్మిషన్స్​ పొందడానికి, స్కాలర్​ షిప్స్​, ఉద్యోగాలకు అప్లై చేయడానికి, ఎంట్రన్స్​ టెస్టులు రాయడానికి ఎంతో అవసరం. అయితే.. ఒక్కోసారి ఆ మెమోలను అభ్యర్థులు పోగొట్టుకుంటూ ఉంటారు. వాటిని తిరిగి ఎలా తెచ్చుకోవాలో తెలియక అవస్థలు పడుతుంటారు. మీరు కూడా ఇలా.. ఇంటర్ మెమో పోగొట్టుకొని ఉంటే.. ఇంట్లో కూర్చునే డూప్లికేట్​ మెమో కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి అది ఎలా అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

డూప్లికేట్​ మెమో కోసం అర్హతలు: ఈ మార్క్స్​ మెమో పొందాలనుకునే వారు కచ్చితంగా ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​, సెకండియర్​ ఉత్తీర్ణులు అయి ఉండాలి. అలాగే మెమో పొందేందుకు సుమారు 1000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

కావాల్సిన పత్రాలు:

  • ఇంటర్మీడియట్​ హాల్​ టికెట్​ నెంబర్​
  • అభ్యర్థి వివరాలు
  • సెల్ఫ్​ డిక్లరేషన్​ అప్లికేషన్​
  • అఫిడవిట్​
  • కాలేజీ ప్రిన్సిపల్​ నుంచి లెటర్​

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

  • ముందుగా తెలంగాణ బోర్డ్​ ఆఫ్​ ఇంటర్మీడియట్​ ఎడ్యుకేషన్​(TGBIE) అధికారిక వెబ్​సైట్​ను సంప్రదించాలి. https://tgbie.cgg.gov.in/home.do
  • హోమ్​ పేజీలో స్టూడెంట్​ ఆన్​లైన్​ సర్వీసెస్​(Student Online Services) ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఆ తర్వాత ఎడమ వైపు కాలమ్​లో డూప్లికేట్​/ట్రిప్లికేట్​ పాస్​ సర్టిఫికెట్​ (Duplicate/Triplicate Pass Certificate) ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఆ తర్వాత స్క్రీన్​ మీద కనిపిస్తున్న బాక్స్​లో హాల్​ టికెట్​ నెంబర్​ ఎంటర్​ చేసి Proceed ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • స్క్రీన్​ మీద మీ వివరాలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి కావాల్సిన డాక్యుమెంట్స్​ను అప్​లోడ్​ చేయాలి.
  • ఆ తర్వాత Submit and Pay ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. పేమెంట్​ పూర్తి అయిన తర్వాత Acknowledgement Number వస్తుంది. దానిని సేవ్​ చేసుకోవాలి.

స్టేటస్​ చెక్​ చేసుకోవడం ఎలా? : డూప్లికేట్​ మార్క్స్​ మెమోకు అప్లై చేసిన తర్వాత స్టేటస్​ను చెక్​ చేసుకోవచ్చు. అది ఎలాగంటే..

  • హోమ్​ పేజీలో Know Your Application Status ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఆ తర్వాత మీరు అప్లై చేసిన సమయంలో వచ్చిన Acknowledgement Number ఎంటర్​ చేసి Get Status ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • మీ అప్లికేషన్​కు సంబంధించిన స్టేటస్​ వివరాలు స్క్రీన్​ మీద డిస్​ప్లే అవుతాయి.

ఎస్సీ ఉపకార వేతనాలకు కొత్త దరఖాస్తు - ఎలా అప్లై చేసుకోవాలంటే ?

ఇక డిగ్రీ మార్కుల మెమోపై నో ఆధార్​ నంబర్​.. UGC కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.