Heat Stroke in Karimnagar Govt Hospital : కరీంనగర్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లాల్లోని మాతాశిశు ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా ఉంది. బాలింతలు, శిశువులు ఉక్కపోతతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఒక్కో బాలింత వద్దకు ఇద్దరు, ముగ్గురు బంధువులు వస్తుండడంతో వార్డు మొత్తం ఉక్కపోతతో, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారుతోంది. వార్డుల్లో రెండు బెడ్లకు కలిపి ఒక్క ఫ్యాన్ ఉండడంతో, అది సరిపోక కొత్తగా టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు.
20 గంటల పాటు చీకటి గదిలో బందీగా బధిర బాలుడు - ఆ తర్వాత ఏమైందంటే?
Lack of Facilities in Govt Hospital : మాతా, శిశు ఆరోగ్య కేంద్రానికి రోజూ 200మందికి పైగా గర్భిణీలు ఓపీకి వస్తుంటారు. ఇక్కడ స్థలం తక్కువగా ఉండడం, ఓపీ ఎక్కువగా ఉండటంతో ఫ్యాన్ల గాలి సరిపోవడం లేదని వారు వాపోతున్నారు. కొందరు గర్భిణీలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంటున్నారు. నాలుగు బాలింతల వార్డుల్లో ఎప్పుడూ 100 మందికిపైగా ఉంటారు. సాధారణ ప్రసవమైన వారు మూడు రోజుల్లో ఇంటికి వెళ్తారు. కానీ శస్త్రచికిత్స చేసిన మహిళలు ఏడు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది.
మరేదైనా సమస్య ఉంటే చికిత్స కోసం ఇంకా ఎక్కువ రోజులే ఉంటారు. దీంతో వార్డుల్లో రోజుల కొద్దీ ఉండడం వల్ల ఉక్కపోతతో తమకు కుట్లు మానట్లేవని, చెమటతో ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదముందని బాలింతలు ఆందోళన చెందుతున్నారు. ఎండ వేడిమికి ముక్కు పచ్చలారని శిశువులతో పాటు బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆస్పత్రిలో ఉన్న ఏసీలకు మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.
నల్గొండ జిల్లాలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో ఎండ వేడిమికి బాలింతలు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ద్వారా బాలింతల వార్డులకు 32 ఏసీలను ఏర్పాటు చేయించారు. స్వచ్ఛంద సంస్థలు, నాయకులు స్పందిస్తే ఇక్కడ కూడా గర్భిణీలు, బాలింతలకు కొంత ఉపశమనం లభిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు. మరోవైపు రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం మర్మమతులతో పాటు అవసరమైన చోట మరిన్ని ఏసీలు ఏర్పాటు చేయాలని బాలింతలు కోరుతున్నారు.
"ఆస్పత్రిలో కూలర్లు, ఏసీల కొరత ఉన్న మాట వాస్తవమే. ఉష్ణోగ్రతల పెరుగుదలతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల కాలం నుంచి ఆస్పత్రికి రోగుల తాకిడి కూడా పెరిగింది. అవసరమైన సదుపాయాల గురించి పైఅధికారులకు నివేదిక సమర్ఫించాం". - డాక్టర్, కరీంనగర్ ఆస్పత్రి
కాటేసిన పాముతో ఆసుపత్రికి - బాధితుడి చెప్పిన కారణం విని వైద్యులు షాక్!
అమ్మ బాబోయ్!! కిడ్నీలో ఏకంగా 418 రాళ్లు - రెండు గంటలు శ్రమపడి తొలగించిన డాక్టర్లు