ETV Bharat / state

కమీషన్​ కోసం పనిచేసే స్థాయి నుంచి మత్తుదందాలో కింగ్​ స్థాయికి - స్టాన్లీ స్టోరీ 'పుష్ప'కు ఏమాత్రం తీసిపోదుగా! - TS NAB Team Investigation Stanley

Drug Dealer Stanley Case Update : మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన డ్రగ్ సరఫరాదారుడు స్టాన్లీ మత్తు దందా లింకులు విదేశాల వరకూ వ్యాపించాయి. గతంలో కమీషన్ కోసం డ్రగ్స్ విక్రయించే స్టాన్లీ, ప్రస్తుతం మాదక ద్రవ్యాలు కావాల్సిన కస్టమర్‌కు ఎలాంటి డ్రగ్స్ అయినా అత్యంత వేగంగా డెలివరీ చేసే స్థాయికి ఎదిగాడు. ఇందుకు ఓ పెద్ద శక్తి గోవా జైలు నుంచి పని చేస్తోంది. స్టాన్లీ తన కస్టమర్లకు డెలివరీ చేసి రూ.కోట్లు గడిస్తున్నట్లు టీఎస్​ న్యాబ్‌ పోలీసుల దర్యాప్తులో తేలింది.

Drug Dealer Stanley Case Update
TS NAB Team Investigation on Stanley Case
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 8:17 AM IST

సినిమాటిక్​ లెవెల్​లో స్టాన్లీ డ్రగ్స్​ కేసు అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం

Drug Dealer Stanley Case Update : ఇవాకా ఉడొక స్టాన్లీ. 2 రోజుల క్రితం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తూ చిక్కిన ఈ నిందితుడి వద్ద టీఎస్​ న్యాబ్ పోలీసులు దాదాపు రూ.8 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్ డీలర్లతో అతనికి లింకులు ఉన్నాయని గుర్తించారు. ఈ క్రమంలో స్టాన్లీకి పుణె నుంచి డ్రగ్స్ చేరుతున్నట్లు తేల్చారు. అక్కడ సౌరవ్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం అతడి కోసం పుణెలో రాష్ట్ర న్యాబ్ బృందం గాలిస్తోంది.

ఎన్నో రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టి, తెలంగాణ పోలీసులకు చిక్కి - 'మత్తు'మాఫియా కింగ్​ పిన్​ స్టాన్లీ అరెస్ట్

Drug Dealer Stanley Link with Nigerian : దర్యాప్తులో భాగంగా స్టాన్లీ కంటే ఓ పెద్ద స్ట్రెంత్ గోవా జైలులో ఉన్నట్లు టీఎస్​ న్యాబ్ పోలీసులు గుర్తించారు. ఏళ్ల తరబడి గోవాలో డ్రగ్స్ దందా నడుపుతున్న నైజీరియన్ దేశస్థుడైన ఓక్రాను గతంలో ఎన్​సీబీ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. మూడేళ్లుగా కొల్వాలే సెంట్రల్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్న ఓక్రా అక్కడి జైలు అధికారుల సహాయంతో స్మార్ట్​ఫోన్ వినియోగిస్తున్నాడు. స్టాన్లీ (Stanley Case) నుంచి డ్రగ్స్ ఆర్డర్ రాగానే, జైలు నుంచే ఓక్రా నెదర్లాండ్‌లో ఉన్న మరో డ్రగ్ సరఫరాదారుడికి సమాచారం ఇస్తాడు. అక్కడి నుంచి వస్త్రాలు, పెట్టెల మధ్యలో సరకును పెట్టి కార్గో విమానాలు, సముద్ర మార్గాల ద్వారా కొరియర్లు పుణెకు చేరుతున్నాయి. అక్కడ నెదర్లాండ్ నుంచి వచ్చిన సరుకును సౌరవ్ స్వాధీనం చేసుకుంటాడు.

మరో నైజీరియన్ గ్యాంగ్ అరెస్ట్ - రూ.8కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం

TS NAB Team Investigation on Stanley Case : పుణె నుంచి ఏజెంట్ల ద్వారా స్టాన్లీకి సరకు చేరుతోంది. అక్కడి నుంచి స్టాన్లీ అతని కస్టమర్లకు డ్రగ్స్‌ను అందజేస్తున్నాడు. అయితే ఈ వ్యవహారంలో స్టాన్లీకి సౌరవ్‌కు నేరుగా ఎలాంటి లింక్ లేదని టీఎస్​ న్యాబ్ పోలీసులు గుర్తించారు. స్టాన్లీకి డ్రగ్స్ అవసరం అయినపుడు గోవా జైలులో ఉన్న ఓక్రా ద్వారానే విదేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఓక్రా కేవలం స్టాన్లీకి మాత్రమే కాదు, గోవా నుంచి ఆపరేట్ అవుతున్న ప్రధాన డ్రగ్స్ ముఠాలకు పెద్దమొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓక్రా ఆదేశాల మేరకు వచ్చే ప్రతి డెలివరీని సౌరవ్ తీసుకుని దేశంలో ఉన్న ఇతర డ్రగ్ ముఠాలకు సైతం అందజేస్తున్నట్లు సమాచారం. సౌరవ్ దొరికితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన డ్రగ్ లింకులు బయటపడే అవకాశం ఉందని టీఎస్‌ న్యాబ్(TS NAB) పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతని కోసం పుణెలో ఓ బృందం గాలిస్తోంది.

డ్రగ్ కేసులో హీరో రాజ్​ తరుణ్ ప్రేయసి - రిమాండ్ రిపోర్ట్​లో పలు కీలక అంశాలు

Drug Dealer Stanley Case Full Details : ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు, ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు, ఇంట్లో 75 ఇంచ్‌ల టీవీ, లగ్జరీ జీవితం గడుపుతున్నాడు. బట్టల వ్యాపారం నుంచి మొదలు పెట్టిన ఉడొక స్టాన్లీ, ప్రస్తుతం అధికారులకు లంచాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. డ్రగ్స్ దందాలో కమీషన్లు పోనూ స్టాన్లీ ఏడాదికి సుమారు రూ.2 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. గతేడాది ఎస్సార్​నగర్​ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తూ చిక్కిన ఇద్దరు నిందితులను ఆరా తీయగా గోవాలో బాబా అనే వ్యక్తి నుంచి కొన్నట్లు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసిన సమయంలో స్టాన్లీ వ్యవహారం బయటపడింది. మరోవైపు స్టాన్లీ డ్రగ్ దందాపై దర్యాప్తులో భాగంగా గోవాలో కొల్వాలే సెంట్రల్ జైలులోని వ్యక్తిని సంప్రదిస్తున్నట్లు టవర్ లొకేషన్ ఆధారంగా గుర్తించారు.

Hyderabad Drug Cases : ఇటీవల అతన్ని అరెస్ట్ చేసి విచారించగా, జైలు నుంచి ఓక్రా (Okla Control Drug Operating in Jail) ఇదంతా చేస్తున్నట్లు తేలింది. అయితే గోవా కొల్వాలే సెంట్రల్ జైళ్లో సెల్‌ ఫోన్ల విక్రయం, అక్కడి నుంచి సాగుతున్న డ్రగ్స్ దందాపై టీఎస్‌ న్యాబ్ పోలీసులు అక్కడి అధికారులకు గతంలోనే సమాచారం ఇచ్చారు. తనఖీలు చేసిన సమయంలో చాలా సెల్‌ఫోన్లు పట్టుపడినట్లు సమాచారం. స్టాన్లీ మత్తు దందాలో గోవాలో మరికొందరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోందని టీఎస్‌ న్యాబ్ పోలీసులు తెలిపారు.

హైదరాబాద్​లో మరో డ్రగ్స్​ ముఠా - మైనర్​ బాలుడు సహా బీఫార్మసీ విద్యార్థి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.