ETV Bharat / state

తాగునీటి ఎద్దడిపై అధికారుల ఫోకస్ - బోరుబావుల పునరుద్ధరణ - DRINKING WATER Crisis

Drinking Water Action Plan In Mahbubnagar : జలాశయాల్లో నీటినిల్వలు వేగంగా అడుగంటుతున్న వేళ తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం, జూరాల, కోయల్ సాగర్ జలాశయాల్లో నీటినిల్వలు తాగునీటి అవసరాలకు సరిపడా ఉన్నా నీటి ఎద్దడి ఏర్పడితే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఉన్న బోరుబావుల్ని సిద్దం చేయడం, మరమ్మత్తులకు గురైతే బాగుచేయడం, లీకేజిలను అరికట్టడం, సర్కారీ నీటి వనరులు అడుగంటిపోతే ప్రైవేటు బోర్లు అద్దెకు తీసుకోవడం కోసం సన్నాహాలు చేస్తోంది.

Drinking Water Action Plan In Mahbubnagar

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 27, 2024, 2:06 PM IST

వేసవిలో తాగునీటి ఎద్దడిపై మహబూబ్​నగర్ జిల్లా యంత్రాంగం ఫోకస్- ముందస్తు చర్యలకు ప్రణాళికలు

Drinking Water Action Plan In Mahbubnagar : ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. మిషన్ భగీరథ జూరాల, ఎల్లూరు సెగ్మెంట్ల ద్వారా మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వపనర్తి సహా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని 4,500లకు పైగా ఆవాసాలు, 30కి పైగా మున్సిపాలిటీలకు తాగునీరు అందుతోంది. అత్యధిక ఆవాసాలకు నీరందేది ఎల్లూరు సెగ్మెంట్ నుంచే. ఎల్లూరు మిషన్ భగీరథకు శ్రీశైలం వెనక జలాల నుంచి నీళ్లు తీసుకుంటారు.

ప్రస్తుతం శ్రీలైలం జలాశయ నీటిమట్టం 810 అడుగుల వరకూ ఉంది. 800 అడుగుల వరకూ కె.ఎల్​.ఐ ద్వారా తాగునీరు(Drinking Water Problem) ఎత్తిపోసుకోవచ్చు. నెలకు 0.80 టీఎంసీల చొప్పున నాలుగు నెలలకు 3.2 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయి. శ్రీశైలం నుంచి 5.68 టీఎంసీల వరకూ నీళ్లు ఎత్తిపోసుకునేందుకు అవకాశం ఉంది. జూరాల, కోయల్ సాగర్ జలాశాయాల్లోనూ తాగునీటికి కావాల్సిన నీటి నిల్వలున్నాయి. జులై వరకూ ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను కలిసి ఎదుర్కోవాలని రైతులకు సీఎం పిలుపు

ఒకవేళ అనుకోని ఇబ్బంది ఏదైనా ఎదురైనా, వేగంగా జలాశయాల్లో నీళ్లు అడుగంటినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని అందించేందుకు ఇప్పటికే సన్నాహలు మొదలు పెట్టారు. గ్రామాల్లో పాత బోరుబావుల్ని పునరుద్ధరించారు. కావాల్సినచోట మరమ్మత్తులు చేయించారు. పనిచేయని మోటార్ల మరమ్మతులు, అవసరమైన చోట కొత్త మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. చేతి పంపులుంటే వాటిని తిరిగి వినియోగంలోకి తెస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ సర్కారీ బోర్లలో నీళ్లింకిపోతే ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు.

Drinking Water Crisis in Mahabubnagar : ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఇప్పటికే మహబూబ్‌నగర్‌ జిల్లాకు 2.82 కోట్లు, నాగర్ కర్నూల్ జిల్లాకు 3.05 కోట్లు, నారాయణపేట జిల్లాకు 1.93 కోట్లు, వనపర్తికి 1.77 కోట్లు,గద్వాలకు 1.89 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే గ్రామ కార్యదర్శులు ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ పనులు దాదాపుగా పూర్తి చేశారు. చేయనిచోట వచ్చే వారం పదిరోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులు కాకుండా నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కూడా నియోజకవర్గాల వారీగా తాగునీటి కోసం పలు పనులకు ఇప్పటికే అధికారులకు ప్రతిపాదనలు అందాయి. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో నియోజకవర్గ అభివృద్ధి నిధులతో 13 కోట్ల 61లక్షల పనులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే ఉన్ననీటిని పొదుపుగా వాడుకుంటే నీటి ఎద్దడి ఏర్పడదని వేసవిని గట్టెక్కవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఆ దిశగా ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.

వేసవిలో తాగునీటి ఎద్దడిపై ప్రభుత్వం ఫోకస్ - నాగార్జునసాగర్‌లో కనీస మట్టానికి దిగువ నుంచి తీసుకునేలా ప్లాన్!

అప్పుడే భగ్గుమంటున్న ఎండలు - మొదలైన కరవు - నీటికోసం ఇబ్బంది పడుతున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.