ETV Bharat / state

'బీజేపీని గద్దె దించాల్సిన సమయం వచ్చింది - ఓటర్లను చైతన్యం చేసేందుకు నేటి నుంచి ప్రచారోద్యమం' - mlc kodandaram - MLC KODANDARAM

Kodandaram fires on BJP : దేశంలో బీజేపీ పాలనలో ఆర్థిక అసమానతలు వేగంగా పెరిగిపోతున్నాయని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. మోదీ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, పేదవాడు మరింత పేదవాడిగా, ధనికుడు మరింత ధనికుడిగా మారిపోతున్నాడని విమర్శించారు. సంపన్నులకే సాయం చేసే బీజేపీని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

TPJAC Debate on Modi Govt
Kodandaram fires on BJP
author img

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 4:23 PM IST

TPJAC Debate on Modi Govt : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లను చైతన్యం చేసేందుకు ఇవాళ్టి నుంచి 11వ తేదీ వరకు తెలంగాణవ్యాప్తంగా ప్రచారోద్యమం చేయనున్నామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. మోదీ సర్కారు వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై రాజకీయాలకు అతీతంగా అన్ని జిల్లాల్లో విస్తృత ప్రచారం చేస్తామని ప్రకటించారు.

ఉద్యోగులంతా సమర్ధంగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచిపేరు : కోదండరాం

హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీ జేఏసీ) ఆధ్వర్యంలో "గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం ప్రజలకేం చేసిందో ప్రశ్నిద్ధాం" అనే అంశంపై జరిగిన సమావేశానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో పదేళ్ల మోదీ పాలనలో అసమానతలు గణనీయంగా పెరిగిపోవడమే కాకుండా, బిలియనీర్ల సంఖ్య 60 నుంచి 160 వరకు పెరిగిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌లో 25 శాతం ఆదాయం, 40 శాతం సంపద బిలియనీర్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆక్షేపించారు. దిగువన ఉన్న 50 శాతం పైగా ఉన్న 70 కోట్ల మంది జనాభా చేతిలో కేవలం 6.5 శాతం ఆదాయం, 15 శాతం మాత్రమే సంపద ఉండి అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ వ్యత్యాసం చాలా ప్రమాదకరం దృష్ట్యా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం, మత సామరస్యం కోసం కృషి చేద్ధామని ఆయన పిలుపునిచ్చారు.

"దేశంలో బీజేపీ పాలనలో ఆర్థిక అసమానతలు వేగంగా పెరిగిపోతున్నాయి. పేదవాడు మరింత పేదవాడిగా, ధనికుడు మరింత ధనికుడిగా పెరిగిపోతున్నాడు. సంపన్నులకే సాయం చేసే బీజేపీని గద్దె దించాల్సిన సమయం వచ్చింది". - ప్రొఫెసర్ కోదండరాం, టీజేఎస్ వ్యవస్థాపకుడు

మోదీ పాలనలో ఆర్థిక అసమానతలు వేగంగా పెరిగాయి : కోదండరామ్

తెలంగాణలో ఏడు పార్లమెంట్ స్థానాలు, దేశవ్యాప్తంగా 130 సీట్లు అదనంగా గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి, ఆ స్థానాల్లో విజయం దక్కకుండా చేస్తే, ఎన్నికల్లో సదరు పార్టీకి వచ్చే మెజార్టీకి కోత పెట్టవచ్చని ప్రముఖ సామాజిక కర్త కవిత కురుగంటి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానీకం అత్యంత చురుకైన వారని, బీజేపీకి తగిన సమాధానం ఇస్తారన్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రొఫెసర్ హరగోపాల్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్తలు ప్రొఫెసర్ జి.హరగోపాల్‌, రమా మొల్కోటే, కవిత కురుగంటి, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కో-కన్వీనర్ కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ విస్సా కిరణ్‌, పలువురు సామాజిక కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసు - మరోసారి గాంధీభవన్​కు దిల్లీ పోలీసులు - Amit Shah Fake Video Case

బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లకు ముప్పు : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - Minister Uttam about Reservation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.