ETV Bharat / state

కుటుంబ సర్వేను దేశమంతా గమనిస్తోంది - వారి సందేహాలను వెంటనే క్లియర్ చేయండి : భట్టి

సమగ్ర సర్వేపై ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి వీడియో కాన్ఫరెన్స్ - ప్రజల్లోని సందేహాలను వెంటనే నివృత్తి చేయాలన్న భట్టి

Deputy CM Bhatti
Deputy CM Bhatti On Samagra Kutumba Survey (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2024, 1:35 PM IST

Deputy CM Bhatti On Samagra Kutumba Survey : ఇళ్ల జాబితాలు పూర్తి చేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు, ఎన్యుమరేటర్లతో విస్తృతంగా మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేపై ఉన్నతాధికారులతో భట్టి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయని అన్నారు. జిల్లా కలెక్టర్లు ఎన్యుమరేటర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడితే, ప్రజల సందేహాలు ఏంటో వెనువెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రజల్లోని అనుమానాలను నివృత్తి చేయాలి : ప్రజల సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి వారి అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సార్లు సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. భారతదేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమం ఈ సమగ్ర కుటుంబ సర్వే అని మనం చూపే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతమవడం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. యావత్ దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుటుంబ సర్వేను గమనిస్తుందని వివరించారు.

దేశమంతా గమనిస్తోంది : దేశంలో ప్రగతిశీల భావాలు, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రతి చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వేపై జిల్లా కలెక్టర్లతోపాటు అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.

"ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఎన్యుమరేటర్లతో కలెక్టర్లు మాట్లాడి ప్రజల్లో తలెత్తే సందేహాలు తెలుసుకోవాలి. ప్రజల్లోని అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనేలా రోజూ సమాచారం ఇవ్వాలి. రాష్ట్రంలో సమగ్ర కులగణన దేశమంతా గమనిస్తోంది. "- భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

'మా పర్సనల్ డీటెయిల్స్ మీకెందుకు' : ఎన్యూమరేటర్లు ఇళ్లల్లోకి రాకుండా దుర్భాషలు

నేటి నుంచి కుటుంబ వ్యక్తిగత వివరాల సర్వే - ఇల్లొదిలి దూర ప్రాంతాల్లో ఉండేవారు ఇలా చేస్తే సరిపోతుంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.