ETV Bharat / state

ఈరోజు రాలేను, సోమవారం వస్తా - నాంపల్లి కోర్టుకు కేటీఆర్ విజ్ఞప్తి

కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు బుధవారానికి వాయిదా - కేటీఆర్ కోర్టుకు హాజరు కాలేకపోవడం వల్ల వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

KTR Defamation Case
Defamation Case Of KTR Against Konda Surekha (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2024, 4:02 PM IST

Updated : Oct 18, 2024, 4:40 PM IST

Defamation Case Of KTR Against Konda Surekha : మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్​పై విచారణను ఈ నెల 23కు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. నేడు కేటీఆర్ కోర్టు ఎదుట వాగ్మూలం ఇవ్వాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నారని అయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నేడు వాంగ్మూలం నమోదు చేస్తామని చెప్పినా మళ్లీ సమయం కావాలని ఎలా అడుగుతారని కోర్టు ప్రశ్నించగా సోమవారం లేదా బుధవారం హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణను ఈ నెల 23కి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు ఆయన స్టేట్​మెంట్​ను రికార్డు చేస్తామని కోర్టు తెలిపిది.

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్‌ ఈ నెల 3న నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు పిటిషన్​ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను ఈ నెల 14న విచారించిన నాంపల్లి కోర్టు దాన్ని ఈ నెల‌ 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను ఆరోజు నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని పలువురుని ప్రస్తావిస్తూ కేటీఆర్​పై తీవ్ర ఆరోపణలు చేయడంతో తన పరువుకు భంగం కలిగేలా మంత్రి వ్యవహరించారని కేటీఆర్​ దావా వేశారు.

ఇటీవల మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని పలువురిని ప్రస్తావిస్తూ కేటీఆర్​పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్, కొండా వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి వాంగ్మూలం ​ఇవాళ కోర్టులో ఇవ్వాల్సి ఉంది. కేటీఆర్ విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి స్టేట్​మెంట్ రికార్డును వచ్చే బుధవారానికి వాయిదావేశారు.

మంత్రి కొండా సురేఖకు మరో షాక్ - పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా ​కేసు - 18న కేటీఆర్​ స్టేట్​మెంట్​ రికార్డ్ చేయాలన్న కోర్టు

Last Updated : Oct 18, 2024, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.