Baby Barasala Celebrations : ఆడపిల్ల పుడితే లక్ష్మీ దేవి పుట్టిందని ఎంతో ఆనందంగా మురిసిపోతూ వేడుకలు జరుపుకునే రోజులు వస్తున్నాయి. ఇప్పటికీ ఆడపిల్ల పుట్టిందనగానే అత్తారింటి వాళ్లు అసంతృప్తి, కోడల్ని వేధించడం లాంటివి అక్కడక్కడా చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ తమకు సాక్షాత్తూ లక్ష్మీదేవి పుట్టిందని సంతోషపడుతూ బారసాలలో కొత్త దనం చూపించారు. మనమరాలితో ఇంటికొచ్చిన కోడలికి అత్తింట్లో అపూర్వ స్వాగతం పలికారు.
కూతురిపై ప్రేమ : ఆ చిన్నారి తమ ఇంట్లో అడుగుపెట్టిన శుభసమయంలో పాపకు లక్ష రూపాయల విలువ చేసే రూ. 5 నాణేలు (కాయిన్స్) తో అలంకరించి వేడుక నిర్వహించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన ప్రశాంత్, వర్ష దంపతులకు తొలి సంతానంలో కూతురు పుట్టింది.
తమ ఇంట్లో లక్ష్మి దేవి జన్మించిందని భావించి పాపకు బారసాలలో రకరకాలుగా ఇంటిని రంగు రంగుల పూలు, బెలూన్లతో వివిధ రూపాలలో అలంకరించి బారసాల వేడుకను నిర్వహించారు. పాపను చాపపై పడుకోబెట్టి రూ. లక్ష విలువ చేసే 5 రూపాయల నాణెలతో అందంగా తీర్చి దిద్ది, అపురూపంగా తల్లి తండ్రులు ఆ పాపను ఎత్తుకుని మురిసిపోయారు. పాపాయి నిత్యం లక్ష్మి దేవిలా కళ కళలాడే లాగా అలంకరించామని ఆనందం వ్యక్తం చేశారు. సినిమాలు, సీరియల్స్‌లో చూసే దృశ్యాలు ఇలా నిజ జీవితంలో కనిపించిన ఈ అద్భుతమైన వేడుకను స్థానికులు కూడా చూసి మంత్రముగ్దులయ్యారు.
మీకు వీణా - వాణిలు గుర్తున్నారా..?, సొంతూరులో ఘనంగా పుట్టినరోజు వేడుకలు