Cyber Fraud In Hyderabad : సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్తపంథాలో నేరాలకు పాల్పడుతున్నారు. అత్యాధునికమైన సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ప్రజల ఖాతాల్లో డబ్బును కొల్లగొడుతున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తతతో ఉండాలని ప్రజలకు పోలీసులు తరచూ అవగాహన కల్పిస్తున్నా రాష్ట్రంలో ఏదో ఓ చోట సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులను పోగొట్టుకుంటున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే నగరంలో వెలుగులోకి వచ్చింది. సైబర్ మోసానికి పాల్పడి ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.20.20 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు.
ఇంతకీ ఏం జరిగిందంటే? : తాజాగా నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగిని బురిడీ కొట్టించి అతడి నుంచి రూ.20.20లక్షలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. బాధితుడి ఆధార్ కార్డు పేరిట తైవాన్ నుంచి పార్శిల్ బుక్ చేశారని, ముంబయి, కోల్‌కతాలకు ఈ పార్శిళ్లు వెళ్లాయని నిందితులు బెదిరించారు. భారీ మొత్తంలో ఉన్న వీటికి సంబంధించి మనీలాండరింగ్ చట్టం ప్రకారం కేసు నమోదవుతుందని సైబర్ నేరగాళ్లు బాధితుడికి భయపెట్టారు. విచారణ కోసం రూ.20.20లక్షలు చెల్లించాలన్నారు. ఆ మొత్తాన్ని ఆర్బీఐలో డిపాజిట్ చేయాలని బాధితునికి సూచించారు. విచారణ పూర్తైన తర్వాత తిరిగి చెల్లిస్తామని నిందితులు చెప్పడంతో నమ్మి వారి ఖాతాలో ఆ మొత్తాన్ని బాధితుడు జమచేశాడు. తర్వాత మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ట్రేడింగ్ పేరుతో టీచర్‌కు టోకరా - రూ.29 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు - Cyber Criminals Fraud
Cyber Fraud In The Name Of Credit Card Update : నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కూడా సైబర్ మోసానికి బలయ్యాడు. బాధితుడికి క్రెడిట్ కార్డు అప్డేట్ చేసుకోవాలి అనే పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఎస్బీఐ మేనేజర్‌ను అని పరిచయం చేసుకున్నాడు ఆ గుర్తు తెలియని వ్యక్తి. అది నిజమేనని నమ్మిన బాధితుడు తన ఓటీపీ సహా అన్ని వివరాలను నిందితునికి తెలియజేశాడు. కొంత సేపటికే అతడి ఖాతాలోంచి రూ.1,09831 సొమ్ము గల్లంతైనట్ల గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
స్టాక్ ట్రేడింగ్‌లో లాభాలంటూ రూ. 3.30 కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్లు - Stock Trading Cyber Crime