ETV Bharat / state

'డిజిటల్ అరెస్ట్​'తో భయపెట్టి - వృద్ధ దంపతుల నుంచి రూ.10.61 కోట్లు స్వాహా - Elderly Couple Digital Arrest

Digital Arrest : ఆ వృద్ధ దంపతులు జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సంపదను సైబర్​ నేరగాళ్లు దోచేశారు. డిజిటల్​ అరెస్ట్ పేరిట బురిడీ కొట్టించి, పలు దఫాల్లో మొత్తం రూ.10 కోట్లకు పైగా కొట్టేశారు.

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Elderly Couple Digital Arrest in Hyderabad
Elderly Couple Digital Arrest in Hyderabad (ETV Bharat)

Cyber ​​Fraud in the Name of Digital Arrest : ఆ వృద్ధ దంపతులకు సంతానం లేదు. దీంతో వారు జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సంపాదనను బ్యాంకులో భద్రంగా దాచుకున్నారు. ఈ క్రమంలోనే ఆ సొమ్ముపై సైబర్​ నేరగాళ్ల కన్నుపడింది. వారిద్దరినీ వివిధ రకాలుగా భయపెట్టి డిజిటల్​ అరెస్ట్​ చేశామంటూ బెదిరించి ఏకంగా రూ.10.61 కోట్లను దోచేసుకున్నారు. మోసపోయామని గ్రహించిన వృద్ధులు సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్​లో జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్​కు చెందిన ఓ వృద్ధుడికి జులై 8న ఉదయం ఎస్​బీఐ అధికారులమంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్​ వచ్చింది. 'మీ ఆధార్​ కార్డును ఉపయోగించి వెస్ట్​ ముంబయి బాంద్రాలో మే 9న వేరే వ్యక్తి బ్యాంకు ఖాతా తెరిచారు. ఆ వ్యక్తి డబ్బులు ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు' అని చెప్పారు. దాంతో కంగారుపడిన వృద్ధుడు ముంబయిలో తనకు ఎలాంటి బ్యాంకు ఖాతా లేదని చెప్పగా, అలా అయితే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలుపుతూ ఓ నంబర్ ఇచ్చారు.

వృద్ధుడు ఆ నంబర్​కు ఫోన్​ చేయగా, ఓ ప్రముఖ బ్యాంకులో సురేశ్​ అగర్వాల్​ అనే నేరస్థుడు ఖాతాను తెరిచి మనీలాండరింగ్​ చేస్తున్నాడని అవతలి వ్యక్తి బెదిరించారు. ఆ ఖాతాను తెరిచేందుకు మీ వ్యక్తిగత సమాచారం వినియోగించారని చెప్పారు. వాట్సప్​లో ఈడీ, ఐటీ విభాగాల పేరిట లేఖలు పంపించి, మీ ఆస్తులకు మనీలాండరింగ్​కు సంబంధం లేదని నిరూపించుకోవాలని, హిందూ వివాహ చట్టం ప్రకారం మీ భార్య పేరిట ఉన్న ఆస్తులకూ నేరంతో సంబంధం లేదని నిరూపించుకోవాలని చెప్పాడు. ఒకవేళ నేరంతో సంబంధం లేదని దర్యాప్తులో తేలితే, మూడు రోజుల్లో మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పాడు.

ఈ క్రమంలోనే అవసరమైతే కోర్టుకు హాజరవుతామని, ఈ విషయాన్ని మరెవరితోనూ పంచుకోబోమని వృద్ధ దంపతుల నుంచి హామీ కూడా తీసుకున్నాడు. నిబంధనలు ఉల్లంఘిస్తే 3-7 ఏళ్లు శిక్ష తప్పదని హెచ్చరించాడు. ఈ కేసును నవజోత్​ సిమీ అనే మహిళా ఐపీఎస్​ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పి, ఫోన్​ పెట్టేశాడు. అప్పటి నుంచి సిమీ పేరుతో ఓ మహిళ ప్రతి రెండు గంటలకు ఒకసారి వృద్ధ దంపతులకు ఫోన్​ చేసి భయపెట్టేది. ఈ కేసులో ఇరుక్కోవద్దంటే రవి అనే ఎస్సై చెప్పినట్లు నడుచుకోవాలని సూచించింది. ఇలా వీడియో కాల్స్​ ద్వారా పోలీసుల వేషధారణలో అనేకమార్లు సైబర్​ నేరగాళ్లు విచారణ చేశారు.

దీంతో భయానికి లోనైన వృద్ధ దంపతులు గత జులై 8 నుంచి 26వ తేదీ వరకు 11 విడతలుగా తమ ఖాతాల్లోని మొత్తం రూ.10,61,50,000లను నేరగాళ్లు సూచించిన ఖాతాల్లోకి ఆన్​లైన్​లో బదిలీ చేశారు. వారు బదిలీ చేసిన వెంటనే నేరగాళ్లు మాట్లాడటం మానేశారు. నేరంతో సంబంధం లేదని తేలితే మూడు రోజుల్లోనే డబ్బులు తిరిగి ఖాతాలకు బదిలీ చేస్తామని చెప్పి, రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించి ఇటీవలే టీజీసీఎస్​బీకి బాధితులు ఫిర్యాదు చేశారు.

రూ.10.61 కోట్లు మ్యూల్‌ ఖాతాలకు తరలింపు : ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వృద్ధ దంపతుల సొమ్ము బదిలీ అయిన బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించారు. అవి చాలా మేర ఉత్తరాదికి చెందినవిగా గుర్తించారు. ఈ మేరకు సిమీ, రవిలతో పాటు ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఖాతాలు ఉత్తరప్రదేశ్​లోని ఝాన్సీ, గోరఖ్​పుర్​, వారణాసిలతో పాటు బెంగళూరు, హరియాణాలోని గురుగ్రామ్​, మణిపుర్​, బిహార్​లలోని పలు ప్రాంతాలకు చెందినవిగా గుర్తించారు. అవన్నీ మ్యూల్​ ఖాతాలుగా తేల్చారు. తొలుత ఆ ఖాతాల్లోకి సొమ్మును బదిలీ చేసుకున్న సైబర్​ నేరగాళ్లు, మళ్లీ ఆ సొమ్మును విడతల వారీగా వేరే ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు.

మనోళ్లతోనే మనోళ్లకు టోకరా - చైనా దుండగుల సరికొత్త సైబర్‌ దండయాత్ర - Chinese Cyber Fraud With Indians

దోపిడీ కొండంత - రాబట్టేది గోరంత - సైబర్​ మోసాల సొమ్ము రికవరీలో పోలీసుల అలసత్వం - Less Recoveries in Cyber Crimes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.