Cyber Crimes Increasing in Telangana : ఇటీవలి కాలంలో సైబర్ నేరాల(Cyber Crimes) బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేటుగాళ్లు సరికొత్త పంథాల్లో మోసాలకు పాల్పడుతుండడంతో అమాయకులకు తిప్పలు తప్పడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సునీల్ జవారికి ఆన్‌లైన్ ద్వారా పరిచయమైన గుర్తుతెలియని వ్యక్తి రూ.36 లక్షలు కుచ్చుటోపీ పెట్టాడు.
గూగుల్ వ్యూస్ ద్వారా డబ్బులు వస్తాయని బాదేపల్లికి చెందిన సునీల్ జవారిని నమ్మించాడు. కొంతకాలం తర్వాత యాప్ డౌన్‌లోడ్(App Download) చేసుకొని వ్యవహారాలు కొనసాగించాలని చెప్పాడు. దాంతో యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న ఆయన ఖాతా నుంచి విడతల వారీగా రూ.36 లక్షలు మాయమయ్యాయి. అసలు విషయాన్ని ఆలస్యంగా గమనించిన బాధితుడు లబోదిబోమంటూ జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ వ్యూహాత్మక అడుగులు - సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
Cyber Frauds in Hyderabad : తాజాగా హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన ఓ ఐటీ ఉద్యోగిని వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు పార్ట్‌టైం జాబ్ పేరిట రూ.3.57 లక్షలుకాజేశారు. వివిధ రకాల యాప్స్‌కు గూగుల్‌లో రివ్యూస్ ఇస్తే ఒక్కో టాస్క్‌కు రూ.300 చెల్లిస్తామని కేటుగాళ్లు(Cyber criminals) నమ్మించారు. అనుమానం రాకుండా ఉండేందుకు తొలుత చేసిన వాటికి డబ్బులు చెల్లించారు. దాంతో ఆమె మరిన్ని టాస్క్‌లు ఇవ్వాలని కోరడంతో కొంత మొత్తంలో డబ్బులు చెల్లించి ఈ పార్ట్‌టైం జాబ్‌లో(Part Time Job) చేరాలని సైబర్ నేరస్థులు సూచించారు.
అందుకు అంగీకరించిన ఆమె డబ్బులు చెల్లించి జాయిన్ అయ్యింది. అనంతరం చేసిన టాస్క్‌లకు డబ్బులు ఇవ్వాలని అడగ్గా అదనంగా డబ్బులు చెల్లించాలని నేరస్థులు తెలిపారు. ఇలా బాధిత మహిళ నిందితుల ఖాతాల్లో రూ.3.57లక్షలు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లింకుల పేరిట సైబర్ మోసం : హైదరాబాద్‌లోనే మరో కేసులో ఓ మహిళకు ఫోన్ చేసిన నేరగాళ్లు మీ ఆధార్ నంబర్‌కు ఫోన్ నంబర్ లింక్ అవ్వలేదని తెలిపారు. తాము ఓ లింకు పంపుతామని దానిని క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని అన్నారు. నిజమని నమ్మిన మహిళ వివరాలన్నీ నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఓటీపీని కూడా నేరగాళ్లకు చెప్పింది. ఇంకేముంది ఖాతాలో(Account) ఉన్న రూ.1.28 లక్షలు డెబిట్ అయినట్లు సందేశం వచ్చింది. దాంతో మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైం పోలీసులను(Cyber crime Police) ఆశ్రయించింది.
Telangana Police Action on Cyber Crimes : సులభంగా డబ్బులు వస్తాయని నమ్మి ప్రజలు మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు పాన్‌కార్డు, ఆధార్ కార్డుల వివరాలు, ఓటీపీలు చెప్పకూడదని అనవసరమైన లింకులు ఓపెన్ చెయ్యకూడదని చెబుతున్నారు. సైబర్‌నేరాల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తతే శ్రీరామరక్ష అని అధికారులు సూచిస్తున్నారు.
బెంబేలెత్తిస్తున్న బ్యాంక్ మోసాలు - ఖాతాల లావాదేవీలకు రక్షణ ఎందుకు కరవైంది? - Cyber Crimes In india
సైబర్ నేరాల పట్ల స్వీయ అప్రమత్తతే శ్రీరామరక్ష - జనం అవగాహన రాహిత్యమే నేరగాళ్లకు అవకాశం