Cyber crime police Awareness to Cyber Attacks in AP : సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకుని తర్వాత అమ్మాయిల ఫొటోలు ఎరగా చూపి ఆన్లైన్ మోసానికి పాల్పడటం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. ఇలాంటి సంఘటననే విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఎక్కడో ఒక్కచోట జరుగుతూనే ఉన్నాయి.
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తం : సామాజిక మాధ్యమాల్లో అందమైన ఫొటోలు పెట్టి, పెళ్లి చేసుకుంటానని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగుడిని ముగ్గురు సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. సుమారు రూ. 28 లక్షలకు పైగా వివిధ రూపాల్లో నగదు కొట్టేశారు. హైదరాబాద్‌కు చెందిన కె. లోకేశ్, సాయి ధీరజ్‌లు విశాఖలోని ఓ వ్యక్తిని మోసగించారు. శాలిని అనే యువతీ సహకారంతో మోసం చేసి రూ.28 లక్షలను కొట్టేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు రంగ ప్రవేశం చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. డైటింగ్ యాప్‌ల ద్వారా రకరకాల మార్గాల్లో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారని పేర్కొన్నారు. అపరిచిత కాల్స్‌కు సమాధానం ఇవ్వవద్దని పోలీసులు సూచించారు. అప్లికేషన్స్ లింకును స్వీకరించవద్దని పేర్కొన్నారు.
'యూ ఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్' - అంటే నమ్మకండి! - cyber crimes in AP
1930 నంబరుకు డయల్ : ఆన్లైన్ మోసాల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్ అన్నారు. పెళ్లి చేసుకుంటామని నమ్మించి మోసాలు చేయడం ఇటీవల అధికమయ్యాయని ఈ విషయంలో యువత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఫ్యామిలీ ఫొటోలు సామాజిక మాధ్య మాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పోస్టు చేయవద్దన్నారు. ఆన్లైన్ మోసానికి గురై నగదు కోల్పోయిన బాధితులు మోసపోయిన గంట వ్యవధిలోనే 1930 నంబరుకు సమాచారం అందిస్తే పోయిన నగదు వెనక్కి తేవచ్చునని, సమయం గడిచిపోతే ఆ నగదును మాయగాళ్లు ఇతర ఖాతాల్లోకి తరలించే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి మోసాలు విదేశాల నుంచే ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ తరహా కేసుల్లో దర్యాప్తు మరింత వేగవంతం అయిందని, నిందితులను కూడా సకాలంలో అదుపులోకి తీసుకుంటున్నామని అన్నారు.
అక్రమ ప్రొడక్ట్స్ అంటూ ముంబై పోలీసుల ఫోన్ - తీరా చూస్తే!
సైబర్ నేరాలపై అవగాహన : సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. యూట్యూబర్స్ ద్వారా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు పోటీలు నిర్వహించనున్నారు. సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ షార్ట్ ఫిల్మ్ , రీల్స్‌ను తీసి ప్రజల ఆదరణ పొందిన వారికి బహుమతలు అందిస్తామని జిల్లా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శివాజీ పేర్కొన్నారు.