Devotees Rush At Temples In Telangana : ఆదివారం సెలవు కావటంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడాని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు.
Tirumala Rush Today : వీరికి శ్రీవారి దర్శనం కోసం 36 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తాగునీరు, అన్న ప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
భక్త జనసంద్రమైన యాదాద్రి ఆలయం - దర్శనానికి 3 గంటల సమయం - Devotees Rush in Yadadri Temple
Devotees Rush In Yadadri Temple : మరోవైపు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ధర్మ దర్శనం 3గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటన్నర సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరి, హరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
Rush in Bhadradri Temple : ఆదివారం సెలవు దినం కావడంతో భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు పూర్తయినప్పటికీ గత కొన్ని రోజుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే సీతారాముల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో కదిలి రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనంతో పాటు ప్రత్యేక దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సందర్భంగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల మూలవరులకు ఆలయ అర్చకులు విశేష అభిషేకం నిర్వహించారు. బేడా మండపంలో జరిగే నిత్య కళ్యాణ వేడుకలో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ముగుస్తున్న వేసవి సెలవులు - వేములవాడకు పోటెత్తిన భక్తులు
భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి - దర్శనానికి 3 గంటల సమయం - Devotees Rush in Yadadri Temple