Cricketer Hanuma Vihari Met Pawan Kalyan and Nara lokesh : ఏపీ మంత్రి నారా లోకేశ్ భరోసాతో మళ్లీ ఆంధ్రా క్రికెట్ జట్టు తరఫున ఆడాలని నిర్ణయించుకున్నానని మాజీ కెప్టెన్ హనుమ విహారి స్పష్టం చేశారు. జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తానని మంగళవారం తెలిపారు. సచివాలయంలో మంత్రి లోకేశ్‌ను కలిసిన అనంతరం విహారి విలేకర్లతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవమానాలను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లానని, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)తో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారని అన్నారు. మన జట్టును అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలని చెప్పారని తెలిపారు. గతంలో జట్టును ఆరుసార్లు సెమీస్‌కు తీసుకెళ్లానని గుర్తు చేశారు.
Thank you so much for your support sir.
— Hanuma vihari (@Hanumavihari) June 25, 2024
I’ll strive to take Andhra cricket forward.
I’m sure the future of Andhra cricket is in safe hands. https://t.co/9iQS7CdkhI
గత ప్రభుత్వం తన ప్రతిభను తొక్కేసిందని, తాము చెప్పిన వారిని జట్టులో చేర్చుకోలేదని నాటి ఏసీఏ పెద్దలు కుట్ర పన్నారని ఆరోపించారు. తాను ఉంటే వాళ్లకు ఇబ్బందని భావించారని, రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ గత పాలకులు తనను ఇబ్బందులు పెట్టారని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవమానంతో ఆంధ్రా జట్టును వదిలేయడానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కూడా తీసుకున్నానని గుర్తు చేశారు. తాను ఇబ్బందులు పడినప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ అండగా నిలిచారని తెలిపారు.
IPL మినీ వేలానికి ఆ టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్లు దూరం.. ఎవరెవరంటే?
హనుమ విహారిని ఏసీఏ తీవ్రంగా వేధించింది : మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అవమానకరమైన పరిస్థితుల్లో ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్న తెలుగుతేజం హనుమ విహారికి రాష్ట్ర ప్రభుత్వం విశేష గౌరవంతో స్వాగతం పలుకుతోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడైన శరత్‌చంద్రారెడ్డిని ఏసీఏ అధ్యక్షుడిగా నియమించిన గత ప్రభుత్వం క్రికెట్లో రాజకీయ క్రీడ మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Delighted to meet Indian cricketer @hanumavihari today. How he was subjected to political bullying, humiliated and driven out of Andhra Cricket by the earlier Govt was shameful. I have invited him back to Andhra Pradesh and asked him to strive to make Telugus proud once again. He… pic.twitter.com/6RlEeIbLUD
— Lokesh Nara (@naralokesh) June 25, 2024
17వ స్థానంలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకుడి కుమారుడు కుంట్రపాక పృథ్వీరాజ్‌ను ప్రోత్సహించడానికి అసమాన ప్రతిభాపాటవాలున్న హనుమ విహారిని ఏసీఏ తీవ్రంగా వేధించిందని అన్నారు. హనుమ విహారి విశేషానుభవం ఇతరులకు అందకుండా అడ్డుపడిందని, ఇతర రాష్ట్రాల జట్టుకు నేతృత్వం వహించేందుకు నిరభ్యంతర పత్రం ఇవ్వడానికి కూడా ఆయన్ను ఇబ్బంది పెట్టారంటే ఎంత కక్షపూరితంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
పవన్‌ను కలిసిన హనుమ విహారి : ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను ఆంధ్రా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారి కలిశారు. జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా పవన్‌కు వివరించారు.
ఆంధ్రా క్రికెట్ జట్టుకు హనుమ విహారి గుడ్ బై - ఆ రాజకీయ నేత కుమారుడే కారణం!