ETV Bharat / state

విద్యుత్, సింగరేణిలో అవినీతిపై కలిపి విచారణ చేపట్టాలి : కూనంనేని - CPI Kunamneni Comments on Singareni - CPI KUNAMNENI COMMENTS ON SINGARENI

CPI MLA Kunamneni Speech on Singareni : సింగరేణిలో దాదాపు రూ.10, 12 వేల కోట్ల అవినీతి జరిగిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ఆరోపించారు. గతంలో కూడా తాను ఇదే విషయం చెప్పానని, విచారణ కమిటీ వేయాలని అడిగినట్లు గుర్తుచేశారు. విద్యుత్‌పైనే కాదు సింగరేణి సమస్యలపై మాట్లాడాలని ఆయన శాసనసభలో విద్యుత్ రంగంపై జరుగుతున్న చర్చలో డిమాండ్​ చేశారు. సింగరేణిలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలని కోరారు.

TG Assembly Debates on Electricity
CPI MLA Kunamneni Speech on Singareni (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 3:28 PM IST

Updated : Jul 29, 2024, 4:09 PM IST

CPI MLA Kunamneni Demands to Singareni Investigation : విద్యుత్ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయడం బాగానే ఉందని, కానీ సింగరేణిలో జరిగిన అవకతవకలను కూడా బయటపెట్టాలని సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యుత్‌, సింగరేణిని కలిపి విచారణ చేపట్టాలని ఈ రెండింటిని వేర్వేరుగా చూడవద్దని కోరారు.

సింగరేణిలో దాదాపు రూ.10 నుంచి 12 వేల కోట్ల అవినీతి జరిగిందని కూనంనేని ఆరోపించారు. గతంలో కూడా తాను ఇదే విషయం చెప్పినట్లు, విచారణ కమిటీ వేయాలని అడిగినట్లు గుర్తుచేశారు. ఇదే అంశంపై మళ్లీ సభలో తాజాగా డిమాండ్ చేశారు. శాసనసభలో విద్యుత్ రంగంపై జరుగుతున్న చర్చలో సీపీఐ నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని పాల్గొన్నారు.

"ఒక్క పవర్​ప్లాంట్​ మాత్రమే కాదు అప్పులో మునిగిపోవటం. విద్యుత్ విభాగంతో పాటు సింగరేణి కూడా తీవ్రమైన అప్పులవైపు, నష్టాల వైపు వెళ్లడానికి ఈ విద్యుత్​ ప్రాజెక్ట్​లు లేదా జెన్​కో కారణమవుతున్నాయి. ఇప్పటికీ కూడా సింగరేణికి దాదాపు 21 వేల కోట్ల రూపాయలు విద్యుత్​ సంస్థ బకాయి ఉంది. విద్యుత్ అంశంపై శ్వేత పత్రం విడుదల చేశారు బాగుంది, కానీ సింగరేణిలో జరిగిన అవకతవకలపై కూడా విచారణ చేపట్టాలి."-కూనంనేని సాంబశివరావు, సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే

సింగరేణిలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలి : కూనంనేని రాష్ట్రంలో సింగరేణికి రూ. 21వేల కోట్లు ప్రభుత్వం బకాయి ఉందని కూనంనేని తెలిపారు. సింగరేణిలో శ్రమ దోపిడి జరుగుతుందన్న కూనంనేని, జీతాలు పెంచమని అడిగినందుకే గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కార్మికులను సస్పెండ్ చేయడంతో పాటు బదిలీలు చేసిందన్నారు. ఇప్పటికైనా వారందరికి న్యాయం చేయాలన్నారు. సింగరేణిలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

సింగరేణి కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఆ సంస్థ కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు. సింగరేణి కార్మికులకు కనీసం ఉండటానికి ఇళ్లు లేవని, ప్రభుత్వం మానవత్వంతో కార్మికుల గురించి కూడా ఆలోచన చేయాలన్నారు. ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరారు.

విద్యుత్​పై న్యాయవిచారణ కోరింది వాళ్లే - వద్దంటోంది వాళ్లే : సీఎం రేవంత్​రెడ్డి - CM REVANTH SLAMS BRS IN TG ASSEMBLY

మంత్రి కోమటిరెడ్డి Vs జగదీశ్ రెడ్డి - అసెంబ్లీ సాక్షిగా సవాళ్లు ప్రతిసవాళ్లు - KOMATIREDDY Vs JAGADISH REDDY

Last Updated : Jul 29, 2024, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.