ETV Bharat / state

'ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దు' : జానీ మాస్టర్​కు షరతులతో కూడిన బెయిల్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​కు బెయిల్ - షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు - అసిస్టెంట్​పై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయిన జానీ మాస్టర్

Jani Master Bail News Latest
Jani Master Bail News Latest (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2024, 12:45 PM IST

Updated : Oct 24, 2024, 3:37 PM IST

Jani Master Bail News Latest : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. జానీ మాస్టర్, ఆయన కుటుంబ సభ్యులు బాధితురాలి వ్యక్తిగత జీవితంలో కల్పించుకోవద్దని, ఆమె పని చేసే వద్దకు వెళ్లి ఏమైనా ఇబ్బందులు కలిగించినా బెయిల్‌ రద్దు చేస్తామని హైకోర్టు షరతులు విధించింది. మహిళా కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో జానీ మాస్టర్‌పై గత నెల పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

మైనర్‌గా ఉన్నప్పుడు జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. షూటింగ్‌ సమయంలోనూ మేకప్‌ వ్యాన్‌లోకి తీసుకెళ్లి, పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు పేర్కొన్నారు. నిరాకరిస్తే మేకప్‌ వ్యాన్‌లో ఉన్న అద్దానికేసి తలను బాదినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు.

బాధితురాలి వాంగ్మూలం మేరకు జానీ మాస్టర్‌ను గత నెలలో అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినా కోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. మహిళా కొరియోగ్రాఫర్ పూర్తిగా అబద్ధాలు చెబుతున్నారని, జానీ మాస్టర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. జానీ మాస్టర్‌కు డాన్స్‌లో జాతీయ స్థాయి అవార్డు రావడంతో ఓర్చుకోలేని మహిళా కొరియోగ్రాఫర్, తప్పుడు కేసులు పెట్టారని వాదించారు. మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడిన జానీ మాస్టర్‌ ఆమెను ఎదగకుండా అణచి వేస్తున్నాడని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు, షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

జాతీయ పురస్కారం నిలిపివేత : ఇదిలా ఉండగా 2022 సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్​ పురస్కారానికి జానీ మాస్టర్​ ఎంపికయ్యారు. అయితే ఈ కేసు పరిణామాల నేపథ్యంలో ఆ అవార్డును నిలిపివేస్తున్నట్లుగా నేషనల్​ ఫిల్మ్​ అవార్డు సెల్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.్​్​

మధ్యంతర బెయిల్ వద్దన్న జానీ మాస్టర్ - రెగ్యులర్ బెయిల్ పిటిషన్ బుధవారానికి వాయిదా

జానీ మాస్టర్​కు మధ్యంతర బెయిల్ మంజూరు - కారణం ఇదే ​ - Interim Bail For Jani Master

Last Updated : Oct 24, 2024, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.