Controversies in Aadudam Andhra Tournament: క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు 'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆటలు పోటీల నిర్వహణలో అనేక లోపాలు క్రీడాకారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ క్రీడా పోటీలు చివరకు యువకుల మధ్య వివాదానికి కారణమవుతున్నాయి. రాష్ట్రంలో పోటీలు ఎక్కడ నిర్వహించినా ఇరు జట్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలతో తీవ్ర ఘర్షణకు దారి తీస్తున్నాయి. దీంతో చాలా మంది క్రీడా కారులు తీవ్రంగా గాయాపడుతున్నారు. నాయకులలేమో వారికి నచ్చిన జట్టును గెలిచిన జట్లుగా నమోదు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలే వైఎస్సార్ జిల్లాలో, బాపట్ల జిల్లాలోను జరిగింది.
'ఆడుదాం ఆంధ్ర'లో గొడవలు - సహనం కోల్పోతున్న క్రీడాకారులు
Complaint Against Adudam Andhra Programme: వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పురపాలకలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జరిగిన క్రికెట్ పోటీలలో అక్రమాలు జరిగాయని రాయల్ బుల్లెట్ జట్టు ఆరోపించింది. గెలిచిన వారిని ఓడినట్లు ఓడిన వారిని గెలిచినట్లు ఆన్లైన్లో నమోదు చేసి అక్రమాలకు పాల్పడినట్లు జట్టు సభ్యులు ఆరోపించారు. గెలిచిన వారిని కడపలో జరిగే ఫైనల్ మ్యాచ్ పంపించకుండా ఓడిన వారిని ఆన్లైన్లో నమోదు చేసి పంపించారని అన్నారు. దీనికి బద్వేలు పురపాలిక కార్యాలయంలో పనిచేసే సునీల్ కారకుడని అతనితో జట్టు సభ్యులు వాగ్వాదానికి దిగారు.
'ఆడుదాం ఆంధ్ర' పోటీల్లో బాహాబాహీ- ఇరుజట్ల మధ్య తీవ్ర వాగ్వాదం
సునీల్‌కు, రాయల్ బుల్లెట్ జట్టు బృందం మధ్య పురపాలక కార్యాలయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. గెలిచిన వారికి కప్పు ఇచ్చి ఓడిపోయిన వారిని కడప ఫైనల్ మ్యాచ్‌కు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారికి ఇచ్చిన మెడల్స్ కప్పులు వెనక్కి ఇస్తామని రాయల్ బుల్లెట్ జట్టు అంది. వివాదం పెద్దది కావడంతో చైర్మన్ రాజగోపాల్ రెడ్డి జోక్యం చేసుకొని మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గెలుపొందిన క్రికెట్ జట్టు బృందం పురపాలక చైర్మన్ రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. ఈ అవకతవగలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేసింది.
గుంతల రోడ్లపై 'ఆడుదాం ఆంధ్ర' - మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంపై నిరసన
YCP leaders Intervention in Aadudam Andhra: బాపట్లలో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో పోటీలను నిర్వాహకులు అధికార వైసీపీ నేతలు చెప్పినట్టు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. బాపట్ల, అద్దంకి, వేమూరు, పర్చూరు జట్లు మధ్య జరుగుతున్న క్రికెట్ పోటీలో పర్చూరు జట్టు గెలుపే లక్ష్యంగా స్థానికేతర క్రీడాకారులను తీసుకువచ్చి ఆడించటం వివాదానికి కారణమైనది. ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే వక్రబుద్ధితో బాగా ఆడే క్రీడాకారులను జట్టులోకి తీసుకున్నారని బాపట్ల జట్టు సభ్యులు ఆరోపించారు. నకిలీ ఆధార్ కార్డులు చూపించి బయట క్రీడాకారున్ని ఆడించటం అన్యాయమని మండిపడుతున్నారు. నిర్వాహకులకు ఫిర్యాదు చేసిన వారికే మద్దతు తెలపడంపై బాపట్ల జట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పర్చూరు జట్టుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.