Congress Ministers Huzurnagar Visit : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వైద్య నియామకాలతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక వసతులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
హుజూర్నగర్ 100 పడకల ఆసుపత్రి మౌలిక సదుపాయాల కల్పనకై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వం 1800 రకాల వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. సర్జరీ, హార్ట్ స్టెంట్(Heart Stent) లాంటి వాటికి కూడా ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తోందని చెప్పారు. సూర్యాపేట మెడికల్ కళాశాల స్థలం వివాదంలో ఉందని, త్వరలో ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు.
'ఆరోగ్య శ్రీ పథకం కింద 1672 నుంచి 1800 రకాల వైద్య సేవలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ఆర్థిక భారంగా రూ.427 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా పెద్ద ఆపరేషన్స్ కూడా ఆరోగ్యశ్రీ కింద చేసేలా సదుపాయలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది' - దామోదర్ రాజనర్సింహ , ఆరోగ్య శాఖ మంత్రి
Minister Damodar Raja Narasimha At Huzurnagar : ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి రోగానికి సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యాధికారులను ఆదేశించారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ మందులు కొనకుండా, పేదవారికి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 75 శాతానికి మించి వైద్య అందించాలని సూచించారు.
హుజూర్నగర్ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. నిరుపేదలకు అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ(Aarogyasri) పథకంలో భాగంగా రూ. 10 లక్షల వరకు పెంచామని గుర్తు చేశారు. హుజూర్నగర్ నియోజక వర్గంతోపాటు అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని తెలిపారు.
'ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కావాల్సిన మౌలిక వసతుల లిస్ట్ ప్రభుత్వానికి పంపించండి. హుజూర్నగర్ 100 పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు మెరుగుపర్చడానికి అమలు చేసిన ఆరోగ్యశాఖ మంత్రికి ధన్యవాదాలు' - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి
కేసీఆర్ సర్కార్ అవినీతిని ఊరూరా చాటి చెప్పండి - పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అంటేనే వెట్టిచాకిరి - ఈ దుస్థితి మారాలి : కోదండరాం