ETV Bharat / state

తెలంగాణలో నిర్వహించే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది : రాహుల్​ గాంధీ - RAHUL ATTEND CASTE CENSUS MEETING

కులగణనపై రాష్ట్రంలో జరిగిన సదస్సుకు హాజరైన కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ - కులగణనను ఎక్స్​రేతో పోల్చుతానని వెల్లడి - కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేది అధికారులు నిర్ణయించకూడదని, సామాన్యులే నిర్ణయించాలని వెల్లడి

Rahul Attend Caste census Meeting
Rahul Attend Caste census Meeting (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2024, 7:30 PM IST

Updated : Nov 5, 2024, 9:50 PM IST

Rahul Attend Caste census Meeting : రాష్ట్రంలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. కులగణనను ఎక్స్​రేతో పోల్చుతానని ఆయన అభివర్ణించారు. ఈ క్యాస్ట్​ సెన్సెస్​ ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలిపారు. బోయిన్​పల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై ఏర్పాటు చేసిన సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.

కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది : కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు ఎక్కువగా ఉంటాయని రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. అంటరానితనం భారత్‌లో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా లేదన్న ఆయన దేశం ఆర్థికంగా ఎదగాలంటే కులవివక్ష ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కులగణనలో కొన్ని పొరపాట్లు జరగవచ్చని వాటిని సరిదిద్దుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పరిమితిని తీసేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేదానిపై సామాన్యులే నిర్ణయించాలని ఆయన పేర్కొన్నారు.

"భారత్​ ఆర్థికంగా, శక్తివంతంగా ఎదగాలన్నా, దేశంలో సంతోషం పెరగాలన్నా ఈ కుల వివక్షను నిర్మూలించాలి. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మహిళల వద్దకు వెళ్లినప్పుడు ఈ దేశంలో అందరికీ సమానత్వం ఉందని చెప్పలేకపోతున్నా. ఇతర నేతల్లా అబద్ధాలు చెప్పలేకపోతున్నా. రాష్ట్రంలో కులగణన చేయించడమే కాదు భారత్​కు తెలంగాణ ఒక ఆదర్శవంతంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. కులగణనలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు వాటిని సరిదిద్దుతాం. ఇది ప్రజలు, పౌర సమాజం, ప్రభుత్వం మధ్య సంభాషణలా ఉండాలని కోరుకుంటున్నా"- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

Rahul Gandhi Comments On Caste System : 'దేశంలో కులవ్యవస్థ ఉందని ఒప్పుకొందాం. నేను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడమా? ఈ కులగణన ద్వారా ఓబీసీలు, దళితులు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుంది. ఈ గణన తర్వాత ఎవరి వద్ద ఎంత ఆర్థిక వనరులున్నాయో తెలుసుకుందాం. జనాభా తగ్గట్లు రిజర్వేషన్లు పెంచుతాం, కులగణన చేస్తామని పార్లమెంట్​లో స్పష్టంగా చెప్పాను' అని రాహుల్​ గాంధీ తెలిపారు.

రేపటి నుంచి మీ ఇంటికి ఆఫీసర్లు - ఆ వివరాలన్నీ అడుగుతారట! - స్టిక్కర్ వేయించుకోవడం మర్చిపోవద్దు

'సమగ్ర కులగణన అన్ని పథకాలకు మెగా హెల్త్​ చెకప్​లా ఉపయోగపడుతుంది'

Last Updated : Nov 5, 2024, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.