ETV Bharat / state

ఫోన్ ట్యాపింగ్‌లో అప్పటి డీజీపీ, హోంమంత్రిపైనే అనుమానాలు : నిరంజన్ రెడ్డి - niranjan reacts on phone tapping - NIRANJAN REACTS ON PHONE TAPPING

Niranjan Reacts on Phone Taping : గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్​ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఇంటి నుంటి 300 మీటర్ల దూరంలో ఇల్లు అద్దెకు తీసుకుని అయన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌లో అప్పటి డీజీపీ, హోంమంత్రి ఇతర అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నిరంజన్ వివరించారు.

Phone Tapping Case
Niranjan Reacts on Phone Tapping
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 5:47 PM IST

Niranjan Reacts on Phone Tapping : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని, రాష్ట్రంలోనూ బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్​ ధ్వజమెత్తారు. తెలంగాణ పోలీసులు అంటే గొప్పగా చెప్పుకొన్న పరిస్థితి నుంచి, ఇప్పుడు సిగ్గుపడే విధంగా మారిందని ఆయన విమర్శించారు.

సొంత అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ - ప్రణీత్ టీమ్ ప్రైవేట్ దందా మామూలుగా లేదుగా! - Telangana Phone Tapping Case

బీఆర్ఎస్ హయాంలో ముగ్గురు కీలక హోదాల్లో ఉన్న సివిల్ సర్వీస్ అధికారులు అపరిమిత అధికారం, మితిమీరిన స్వేచ్ఛతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రముఖ వార్తపత్రికలో కవర్​స్టోరీగా వచ్చినట్లు నిరంజన్ తెలిపారు. వీరందరూ కలిసి కీలకమైన రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆయన ఆరోపించారు. ఈ సాంకేతికతను ఇజ్రాయిల్ నుంచి తీసుకువచ్చారని, వాటిని దుర్వినియోగం చేసినట్లు ఆయన తెలిపారు.

రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో ఇల్లు అద్దెకు తీసుకుని అయన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని నిరంజన్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌లో అప్పటి డీజీపీ, హోంమంత్రి ఇతర అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ అధికారుల పనితీరును పర్యవేక్షించే, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని నిరంజన్ ప్రశ్నించారు. ప్రణీత్‌ రావు బ్యాచ్‌ వ్యాపారస్తులను కూడా బ్లాక్‌ మెయిల్ చేసి వేల కోట్లు దండుకుందని మండిపడ్డారు. ఈ విషయంలో డీజీపీ, హోం సెక్రటరీకి లేఖ రాస్తామని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సి ఉందన్నారు.

"రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. బీఆర్ఎస్ హయాంలో ముగ్గురు కీలక హోదాల్లో ఉన్న సివిల్ సర్వీస్ అధికారులు అపరిమిత అధికారం, మితిమీరిన స్వేచ్ఛతో వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి ఇంటి నుంటి 300 మీటర్ల దూరంలో ఇల్లు అద్దెకు తీసుకుని అయన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో అప్పటి డీజీపీ, హోంమంత్రి ఇతర అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి". - నిరంజన్, కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు

Telangana Phone Tapping Case : రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తొలుత ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టయిన ప్రణీత్‌రావును(Praneeth Rao) విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదంతా అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణీత్‌ రావు వాంగ్మూలంలో వెల్లడించాడు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు - ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రిమాండ్‌ - TS PHONE TAPPING CASE UPDATE

ఈకేసులో మరో ఇద్దరు అధికారులను కస్టడీలోకి తీసుకున్నారు. వీరిలో భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో, తిరుపతన్న ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావు, ఐ న్యూస్‌ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌ రావు అరువెల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌లో అప్పటి డీజీపీ, హోంమంత్రిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిరంజన్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నేరం అంగీకరించిన నిందితులు! - నేడు కస్టడీకి కోరనున్న పోలీసులు - Telangana Phone Tapping Case

'ఏప్రిల్​లో తుక్కుగూడలో కాంగ్రెస్‌ జాతీయస్థాయి సభ - అక్కడి నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం' - Congress National level meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.