Congress Assembly Discussions : తెలంగాణ నీటి హక్కులను, కృష్ణా నదీ జలాలను గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతలకు ప్రగతి భవన్‌లోనే పునాది పడిందని ఆరోపించిన ఆయన, నాగార్జున సాగర్‌పై ఏపీ పోలీసులు తుపాకులతో కవాతు చేస్తోంటే అడ్డుకోవాల్సింది ఎవరని ప్రశ్నించారు. ధర్నాలు చేయాల్సింది నల్గొండలో కాదని, ప్రాజెక్టులు గుంజుకుంటానన్న మోదీ దగ్గరని హితవు పలికారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు.
ఆ వార్తలు తప్పయితే రేవంత్ సర్కార్ వివరణ ఎందుకివ్వలేదు?: హరీశ్‌రావు
Congress Fires On BRS : కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రాజెక్టులను లాక్కుంటుంటే అడ్డుకోకుండా సహకరించింది గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రూ.97.5 వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంతో 90 వేల ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్నది వాస్తవం కాదా అన్నారు. సీఎం విమర్శలపై ఎదురుదాడి చేసిన బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత జనవరిలో కేంద్రంతో సమావేశం జరిగింది. ఫిబ్రవరిలో బోర్డు సమావేశంలో ప్రాజెక్టుల అవుట్‌లెట్ల అప్పగింతకు అంగీకరించారని ఆరోపించారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకుండా పదేళ్లుగా బీఆర్ఎస్ అడ్డుపడగా, కాంగ్రెస్ స్వాధీనం చేసిందని ఈ విషయాన్ని మినిట్స్‌లో కేంద్ర జలశక్తి శాఖ పేర్కొందన్నారు.
గవర్నర్ ప్రసంగానికి శాసనసభ ఆమోదం - రేపు మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్
CM Revanth Reddy Fires On Harish Rao : హరీశ్‌రావు ఆరోపణలను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తప్పుబట్టారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను ఎవరికీ అప్పజెప్పలేదన్న ఉత్తమ్, భవిష్యత్తులోనూ అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శాసనసభ ప్రారంభమైన వెంటనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు వేముల వీరేశం ప్రతిపాదించగా దీనిపై బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐలకు చెందిన సభ్యులు చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ పాలనలో ఫలానా లోపాలు ఉన్నాయని సూచనలివ్వాల్సిన ప్రతిపక్షనేత కుర్చీ, ఖాళీగా ఉండటం సమాజానికి మంచిది కాదని సీఎం పేర్కొన్నారు.
"కృష్ణా జలాలు అప్పజెప్పింది ఎవరు? 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు అధికారికంగా సంతకం పెట్టి తెలంగాణ రైతుల హక్కులను వారికి ధారదత్తం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తుంటే, కాళ్లలో కట్టే పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బోర్ల పడవేయాలని బీఆర్ఎస్ చూస్తుంది. నదీ జలాలను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటుంటే దిల్లీలో ధర్నా చేయాల్సింది పోయి నల్గొండలో చేస్తున్నారు. అమరవీరుల హక్కులను కాపాడటానికి ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మేడిగడ్డ బ్యారేజీ మేడిపండు అయ్యింది. అన్నారం బ్యారేజీ పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రూ. 97,500 వేల కోట్లను ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో 95,000 ఎకరాలకు నీరు అందివ్వలేని పరిస్థితి ఏర్పడింది." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
Congress Comments On BRS : వంద రోజులైనా పూర్తిచేసుకోని తమ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం పదే పదే విమర్శిస్తోందన్న ఆయన, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో కచ్చితంగా నెరవేర్చుతామన్నారు. ముఖ్యమంత్రి విమర్శలపై బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రతివిమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుందన్న ఆయన, అందెశ్రీ రచించిన గీతాన్ని తమ పార్టే ప్రజల్లోకి తీసుకెళ్లిందన్నారు. కవులు, కళాకారులు, ఉద్యమకారులకు కేసీఆర్(EX CM KCR) ప్రభుత్వంలోనే తగిన గుర్తింపు లభించిందని గుర్తు చేశారు.
కృష్ణానదీ జలాల వివాదంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్‌రావు కౌంటర్ - ప్రత్యక్షప్రసారం
తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుని గడీల ఉండలేదు : సీఎం రేవంత్ రెడ్డి