Congress Appointed Parliament Incharges in Telangana : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ(Dipadas Munshi) ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు, సీనియర్ నేతలను ఇంఛార్జులుగా నియమిస్తూ మార్పులు చేసినట్లు కాంగ్రెస్ హైకమాండ్ వర్గాలు తెలిపాయి.
Telangana Congress Appointed New Parliament Incharges : ఖమ్మం కాంగ్రెస్ ఇంఛార్జిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ పార్లమెంట్ ఇంఛార్జిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ ఇంఛార్జిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మహబూబాబాద్ పార్లమెంట్ ఇంఛార్జిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao), సికింద్రాబాద్ నియోజకవర్గ ఇంఛార్జిగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పెద్దపల్లి కాంగ్రెస్ ఇంఛార్జిగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నియమితులయ్యారు.
వరంగల్ కాంగ్రెస్ ఇంఛార్జిగా ప్రకాశ్‌రెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జిగా ఒబేదుల్లా కొత్వాల్, భువనగిరి స్థానం నుంచి ఇంఛార్జిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ ఇంఛార్జిగా నరేందర్‌రెడ్డి, మల్కాజిగిరి కాంగ్రెస్ ఇంఛార్జిగా మైనంపల్లి హనుమంతరావు, నిజామాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జిగా సుదర్శన్‌రెడ్డి, మెదక్ కాంగ్రెస్ ఇంఛార్జిగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జిగా గిరిజనశాఖ మంత్రి సీతక్క, నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఇంఛార్జిగా ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జహీరాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జిగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది.
*తెలంగాణలో ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జులు వీరే :
క్రమ సంఖ్య | ఇంఛార్జి పేరు | పార్లమెంట్ నియోజకవర్గం |
01 | పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి | ఖమ్మం |
02 | ఉత్తమ్‌కుమార్‌రెడ్డి | నల్గొండ |
03 | పొన్నం ప్రభాకర్ | కరీంనగర్ |
04 | శ్రీధర్‌బాబు | పెద్దపల్లి |
05 | ప్రకాశ్‌రెడ్డి | వరంగల్ |
06 | తుమ్మల నాగేశ్వరరావు | మహబూబాబాద్ |
07 | ఒబేదుల్లా కొత్వాల్ | హైదరాబాద్ |
08 | కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి | సికింద్రాబాద్ |
09 | కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి | భువనగిరి |
10 | జూపల్లి కృష్ణారావు | నాగర్‌కర్నూల్ |
11 | నరేందర్‌రెడ్డి | చేవెళ్ల |
12 | మైనంపల్లి హన్మంతరావు | మల్కాజిగిరి |
13 | కొండా సురేఖ | మెదక్ |
14 | సుదర్శన్‌రెడ్డి | నిజామాబాద్ |
15 | సీతక్క | ఆదిలాబాద్ |
16 | దామోదర రాజనర్సింహ | జహీరాబాద్ |
17 | సంపత్ కుమార్ | మహబూబ్‌నగర్ |