ETV Bharat / state

ధ్యానం ఒక పనిగా కాదు - ప్రతి పనిని ధ్యానంగా చేయాలి : సీఎం రేవంత్ - CM REVANTH ABOUT BUDDHA PURNIMA

Buddha Purnima Celebrations 2024 in Secunderabad : గౌతమ బుద్ధుడిని ప్రపంచం మొత్తం అనుసరిస్తుందని ఆయన ఆలోచనలు జ్ఞానాన్ని, శాంతి మార్గాన్ని బోధిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ధ్యానం ఒక పనిగా చేయడం కాదని ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్నారు. బుద్ధ పూర్ణిమ వేడుకను పురస్కరించుకుని ఆయన సికింద్రాబాద్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌ను సందర్శించారు.

CM Revanthreddy On Buddha Purnima
Buddha Purnima Celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 2:50 PM IST

Updated : May 23, 2024, 4:37 PM IST

CM Revanth Participate in Buddha Purnima Celebrations : ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని ప్రతి పనిని ధ్యానంగా చేయడం అలవర్చుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. బుద్ధ పూర్ణిమ వేడుకను పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌ను సీఎం రేవంత్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహా బోధి బుద్ధ విహార ఆధ్వర్యంలో మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల సంతోషించారు.

CM Revanth Reddy On Dhyanam : శాంతి సాధన, స్థాపన కోసం, సమాజానికి మేలు జరగాలని ఉద్దేశంతో చిన్న వయసులోనే అన్ని త్యాగాలను చేసిన గొప్ప మహనీయుడు గౌతమ బుద్ధుడని సీఎం రేవంత్ కొనియాడారు. గౌతమ బుద్ధుడిని ప్రపంచం మొత్తం అనుసరిస్తుందని ఆయన ఆలోచనలు జ్ఞానాన్ని, శాంతి మార్గాన్ని బోధిస్తాయని పేర్కొన్నారు. తాను పూర్తిస్థాయిలో కాకున్నా పనిలో కొంతమేరకైనా ధ్యానంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మహాబోధి బుద్ధవిహార్‌కు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం రేవంత్‌ రెడ్డి కుటుంబం - CM REVANTH VISITED TIRUMALA TODAY

CM Revanth Reddy On Gautham Buddha : ధ్యాన మందిరం కోసం ప్రతిపాదనలు పంపితే ఎన్నికల కోడ్‌ ముగిశాక నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సిన బాధ్యత అందరిదని మంచి సందేశం, ఆలోచనను పెంపొందించుకోవాలని అన్నారు. సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనను ఇతరులకు పంచాలని గౌతమ బుద్ధుడు బోధించిన సందేశం అందరికీ అవసరమని వ్యాఖ్యానించారు.

"ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో తనకు ఇష్టమైన లైన్‌ ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ధ్యానంగా చేయాలని సూచనలు చేశారు. అందులో చాలా తత్వం ఉంది. బోధన ఉంది. చదివితే రెండు లైన్లు లాగా కనిపించవచ్చుగానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది. నేను ఏదైనా పని చేసినప్పుడు చాలా ధ్యానంగా చేస్తాను. ఆ స్ఫూర్తిని ఇందులో నుంచి పొందాను. తప్పకుండా ఈ నిర్వహణకు అవసరమైన సంపూర్ణ సహకారం తెలంగాణ ప్రభుత్వం మీకు అందిస్తుంది. ధ్యాన మందిరం గురించి స్పెషల్‌ ఫండ్‌ను ప్రకటిస్తాం." - రేవంత్‌ రెడ్డి, ముఖ్యమంత్రి

ధ్యానం ఒక పనిగా కాదు - ప్రతి పనిని ధ్యానంగా చేయాలి : సీఎం రేవంత్ (ETV Bharat)

ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పాలసీ సిద్ధం చేయాలి : సీఎం రేవంత్ - Revanth on New Industrial Policies

శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ - స్వాగతం పలికిన ఈవో ధర్మారెడ్డి - CM Revanth Reddy Tirumala Visit

Last Updated : May 23, 2024, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.