ETV Bharat / state

ఏపీ ఇవ్వాల్సిన 408 కోట్లను వెంటనే చెల్లించేలా కేంద్రం సహకరించాలి: సీఎం రేవంత్​ - CM REVANTH MEET NIRMALA SITHARAMAN

తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చెేసిన సీఎం రేవంత్ రెడ్డి - వెనుకబడిన జిల్లాలకు రూ. 18 వందల కోట్ల గ్రాంట్ల విడుదలపై నిర్మల సీతారామన్​తో సమావేశం

TELANGANA MPS AND CM
CM REVANTH REDDY MEET NIRMALA SITHARAMAN (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2024, 7:58 PM IST

CM Revanth Request To Central Ministers : రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలువురు కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ల తో సమావేశమయ్యారు. వెనుకబడిన జిల్లాలకు సంబంధించి రూ. 18 వందల కోట్ల గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఉమ్మడి సంస్థల నిర్వహణ ఖర్చులను ఏపీ నుంచి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, పలు కొత్త మార్గాలను కేంద్ర నిధులతోనే చేపట్టాలని అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు.

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో వెనుక‌బ‌డిన జిల్లాల‌కు పెండింగ్‌లో ఉన్న రూ.18 వందల కోట్ల గ్రాంటును వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులోని కేంద్ర ఆర్థిక మంత్రి ఛాంబర్‌లో నిర్మల సీతారామన్‌తో సీఎం భేటీ అయ్యారు. వెనుక‌బ‌డిన జిల్లాల‌కు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటుపై చ‌ర్చించారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఏటా రూ. 450 కోట్ల చొప్పున గ్రాంటు విడుద‌లకు కేంద్రం గతంలో అంగీక‌రించిందని ఆ మేరకు 2019-20 నుంచి 2023-24 వరకు పెండింగ్‌లో ఉన్న రూ. 18 వందల కోట్లను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరారు.

నిర్వాహణను మేమే భరించాం : రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత హైద‌రాబాద్‌లోని హైకోర్టు, రాజ్‌భ‌వ‌న్‌, లోకాయుక్తా, మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌, జ్యుడిషియ‌ల్ అకాడ‌మీ స‌హా ఇత‌ర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భ‌రించిందని సీఎం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వీటి నిర్వహణకు రూ.703 కోట్లను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని. అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా రూ. 408 కోట్లు చెల్లించాల్సి ఉంద‌ని చెప్పారు. డబ్బులు చెల్లించేందుకు ఏపీ అంగీకరించిందని, కేంద్ర హోం శాఖ కూడా ఆంధ్రప్రదేశ్‌కు లేఖ‌లు రాసింద‌ని సీఎం వివ‌రించారు.

ఆంధ్రప్రదేశ్‌ వెంటనే రూ. 408 కోట్లను వడ్డీతో సహా తెలంగాణకు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల‌ని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశీ ఆర్థిక స‌హాయంతో చేప‌ట్టిన ప్రాజెక్టుల‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మ‌ధ్య రుణాల పంపిణీ విష‌యంలో తెలంగాణ నుంచి ఏక‌ప‌క్షంగా 2 వేల రూ. 547 కోట్ల రిక‌వ‌రీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంపై తీవ్ర నిరసన తెలిపినా పట్టించుకోలేదని మరోసారి స‌మీక్షించి స‌రైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

నిధులను ఇప్పించాలి : కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌కు సంబంధించిన నిధుల‌న్నింటినీ 2014-15లో కేవ‌లం ఆంధ్రప్రదేశ్‌కే కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని ఆ మొత్తంలో ఏపీ నుంచి తెలంగాణ‌కు రూ. 495 కోట్లు స‌ర్దుబాటు చేయాల్సి ఉంద‌న్నారు. ప‌లుమార్లు విజ్ఞప్తి చేసినా ఆ మొత్తాన్ని తెలంగాణ‌కు స‌ర్దుబాటు చేయడం లేద‌న్నారు. తాము దృష్టికి తెచ్చిన అంశాల్లో చొరవ తీసుకుని రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇప్పించాల‌ని కేంద్ర మంత్రి నిర్మల సీతారామ‌న్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తోనూ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో కాజీపేట‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని పొందుపర్చిన విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. కాజీపేట‌లో పీరియాడిక‌ల్ ఓవ‌ర్‌హాలింగ్ వ‌ర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని, కానీ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తాను గతంలో లేఖ రాశాన‌ని సీఎం వివ‌రించారు. కాజీపేట‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని తెలిపారు. వికారాబాద్‌-కృష్ణా స్టేష‌న్ మ‌ధ్య రైల్వేశాఖనే పూర్తి వ్యయంతో కొత్త రైలు మార్గం నిర్మించాలని కోరారు.

మారుమూల ప్రాంతాలను కలపండి : ఈ మార్గం నిర్మిస్తే మారుమూల ప్రాంతాలైన ప‌రిగి, కొడంగ‌ల్‌, రావులపల్లి, మాటూరు, దౌల్తాబాద్‌, దామ‌ర‌గిద్ద, నారాయ‌ణ‌పేట్‌, మక్తల్‌ అభివృద్ధి చెంద‌డంతోపాటు తాండూర్ స‌మీపంలోని సిమెంట్ క్లస్టర్‌, ఇత‌ర పరిశ్రమల అభివృద్దికి అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. ఈ మార్గం వల్ల వికారాబాద్ జంక్షన్‌ నుంచి కృష్ణా రైల్వే స్టేష‌న్ల మ‌ధ్య 70 కిలోమీట‌ర్ల దూరం త‌గ్గుతుంద‌ని తెలిపారు. క‌ల్వకుర్తి-మాచ‌ర్ల మ‌ధ్య కొత్త రైలు మార్గం మంజూరు చేయాల‌ని కోరారు. ఈ మార్గంతో సికింద్రాబాద్‌, గుంటూరు, డోన్ స్టేషన్ల మ‌ధ్య అనుసంధాన‌త క‌లిగి శ్రీ‌శైలం వెళ్లే భ‌క్తుల సులభ‌త‌ర ప్రయాణానికి అవ‌కాశం క‌ల్పిస్తుంద‌న్నారు.

డోర్నకల్‌- మిర్యాల‌గూడ, డోర్నకల్‌-గ‌ద్వాల ప్రతిపాదిత రైలు మార్గాల‌ను పునఃప‌రిశీలించాల‌ని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు రైలు మార్గాలు ఖ‌మ్మం జిల్లాలోని సార‌వంత‌మైన భూములు, చెర‌కు ప‌రిశ్రమలు, గ్రానైట్ పరిశ్రమలు, సైబిరియ‌న్ వ‌ల‌స ప‌క్షుల కేంద్రం, భార‌త‌దేశంలోని అతి పెద్ద బౌద్ధ స్తూపం, పాలేరు రిక్రియేష‌న్ ప్రాంతాల మీదుగా ఉన్నాయ‌ని సీఎం తెలిపారు. పాలేరు శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలోని ఈ ప్రాంతంలో భూముల ధ‌ర‌లు భారీగా ఉన్నాయ‌ని భూసేకరణ రైల్వే శాఖ‌కు భారంగా మారుతుంద‌న్నారు. ఆ ప్రతిపాదిత మార్గాలను మార్చి డోర్నకల్‌ నుంచి వెన్నారం-మ‌న్నెగూడెం-అబ్బాయిపాలెం-మ‌రిపెడ మీదుగా మోతె వ‌ర‌కు రైల్వే లైన్లను మార్చాల‌ని సీఎం కోరారు. దీని వల్ల 19 కిలో మీటర్ల దూరం త‌గ్గుతుంద‌ని సీఎం వివ‌రించారు.

బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? - సీఎం రేవంత్ సీరియస్
ఏటా డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం - అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.