CM Revanth Reddy Delhi Tour : రాష్ట్రంలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను హస్తగతం చేసుకునే దిశగా, కాంగ్రెస్ పార్టీ(Congress) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ నాయకుల అభిప్రాయాలు సేకరించారు. ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే సర్వేలు నిర్వహించిన సునీల్ కనుగోలు బృందం, రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందించినట్లుగా తెలుస్తోంది. సర్వేలు, స్థానిక నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నారు.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేపు దిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తుది నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే 2 విడతల్లో 9 మంది అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. మెదక్, భువనగిరి, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది
రాష్ట్ర కాంగ్రెస్ ఈ నెల 29వ తేదీన గాంధీభవన్‌లో సమావేశం కానుంది. ఇవాళ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు ఎమ్మెల్సీ, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5గంటలకు గాంధీ భవన్‌లో జరగనున్న టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో, సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలిపారు.
CONGRESS PARLIAMENT CANDIDATES 2024 : కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన మూడు జాబితాల్లో తెలంగాణలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో నాగర్‌కర్నూల్ కాంగ్రెస్(Congress) ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్, మల్కాజిగిరి అభ్యర్థిగా సునీత మహేందర్‌రెడ్డి, చేవెళ్ల అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డి, మహబూబ్‌నగర్ అభ్యర్థిగా ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ(CWC) ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, నల్గొండ అభ్యర్థిగా కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌లను ఎంపిక చేశారు.
బీఆర్ఎస్ ఖేల్ ఖతమ్ - నెక్స్ట్ బీజేపీకి అదే గతి : సీఎం రేవంత్ రెడ్డి - Lok Sabha Elections 2024