CM Revanth Reddy On Indiramma Houses : దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గం, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు కోసం రెండు రోజుల్లో విధివిధినాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లపై గృహనిర్మాణ శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర పథకంపై ఫోకస్ : ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాల మంజూరులో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వెనకబడి ఉందన్నారు. ఈసారి కేటాయింపుల్లో గరిష్టంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్లు రాష్ట్రానికి దక్కేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రానికి రావల్సిన బకాయిలు రాబట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో డేటాను కేంద్రానికి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సీఎం అన్నారు.
ఎందుకు అప్పగించలేదని అసహనం : పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజినీరింగ్ సిబ్బంది సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలపగా అవసరమైతే ఔట్‌సోర్సింగ్ పద్ధతిన నియామకాలు చేపట్టాలని సీఎం అన్నారు. నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ బ్లాక్‌లు, ఇళ్లు వేలం వేయాలని అధికారులకు తెలిపారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తియినప్పటికీ వాటిని ఎందుకు అప్పగించలేదని సీఎం ప్రశ్నించారు. మౌలిక వసతులు కల్పించి, వాటిని లబ్ధిదారులకు అప్పగించాలని సూచించారు.
Minister Ponguleti On Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే విషయంలో మొదటి ప్రాధాన్యత స్థలాలు ఉన్న పేదలకు ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ తర్వాతి విడతలో ఇంటి స్థలం అందజేస్తామని, అందులో కూడా ఎవరి గృహాలు వారే నిర్మించుకుంటారని మంత్రి వివరించారు. వారికి ఇవ్వాల్సిన నిధులను నిర్దేశించిన సమయంలో విడతల వారీగా విడుదల చేస్తామని తెలిపారు. మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు అయినట్లు వివరించిన మంత్రి, ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500కు తగ్గకుండా ఇళ్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Revanth Reddy challenged BRS : 'ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట బీఆర్ఎస్ ఓట్లు అడగకూడదు..'