ETV Bharat / state

ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రిప్లై - జులై 6న భేటీకి సిద్ధం - CM Revanth Reply to AP CM Letter

CM Revanth Letter to AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు లేఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. విభజన హామీలపై చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తూ, ఈనెల 6న సాయంత్రం భేటీకి సిద్ధమని తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధితోపాటు విభజన హామీలపై కలిసి చర్చిద్దామని సీఎం రేవంత్ ఆహ్వానించారు.​

CM Revanth Respond on AP CM Chandrababu Letter
CM Revanth Reply to AP CM Chandrababu Letter (eenadu.net)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 7:58 PM IST

Updated : Jul 2, 2024, 9:19 PM IST

CM Revanth Reply to AP CM Chandrababu Letter : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6న జ్యోతిరావు ఫులే ప్రజాభవన్ వేదికగా కలిసి చర్చిద్దామని తెలిపారు. విభజన సమస్యల పరిష్కరించుకోవడానికి చర్చలు జరపాలంటూ లేఖ రాసినందుకు చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరఫున చంద్రబాబును ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ముఖాముఖి చర్చించాలన్న చంద్రబాబు సూచనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విభజన చట్టంలోని పెండింగ్‌ సమస్యల పరిష్కారం అవసరమని, వాటిపై కలిసి కూలంకషంగా చర్చిద్దామని సీఎం రేవంత్‌ తన లేఖలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఏపీలో అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించినందుకు లేఖలో చంద్రబాబుకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Revanth Reddy's reply to Chandrababu's letter
ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్​ రెడ్డి లేఖ (ETV Bharat)

విభజన చట్టంలోని పెండింగ్‌ సమస్యల పరిష్కారం అవసరం : స్వతంత్ర భారతదేశంలో నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అతికొద్ది మంది రాజకీయ నేతల్లో ఒకరిగా చంద్రబాబు చేరారని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా చంద్రబాబు ఈ విడతలో విజయవంతం కావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలుగురాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలు అవసరమన్న ఆయన, చర్చలే పరస్పర సహకారానికి గట్టి పునాది వేస్తాయని వ్యాఖ్యానించారు. విభజన చట్టానికి సంబంధించిన అంశాల పరిష్కారం అత్యవసరమన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు మరింత సేవలు అందించేందుకు, పరస్పర ఆలోచనలు పంచుకొని సహకరించుకునేందుకు ముఖాముఖి సమావేశం తప్పనిసరి అవసరం అని సీఎం అన్నారు.

AP CM Chandrababu Naidu Letter to CM Revanth : విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లవుతోందని, విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై పలు దఫాలుగా చర్చలు జరిగినా, పరిష్కారం కాని అంశాలు ఇంకా ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. వీటికి సామరస్యపూర్వక పరిష్కారం సాధించేందుకు కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు, రెండు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి దోహదపడేలా ముఖ్యమైన చిక్కులను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈనెల 6 విభజన హామీల పరిష్కారంపై చర్చించుకుందాం రండి - రేవంత్‌ రెడ్డికి చంద్రబాబు లేఖ - AP CM CBN Letter to CM Revanth

ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ - ఆ అంశాలపై చర్చ! - Two Telugu States CMs Meet

Last Updated : Jul 2, 2024, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.