ETV Bharat / state

ఓయూలో కరెంట్ కోతలు, నీటి కొరత - అదంతా కేసీఆర్ తప్పుడు ప్రచారమేనంటూ రేవంత్ ట్వీట్ - WATER CRISIS IN OSMANIA CAMPUS - WATER CRISIS IN OSMANIA CAMPUS

Water Issues in Osmania University : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటి ఎద్దడి, విద్యుత్ కొరతపై రెండ్రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇదంతా కేసీఆర్ తప్పుడు ప్రచారమేనంటూ మండిపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Osmania University
Water Problem in Osmania University
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 12:14 PM IST

ఉస్మానియ విశ్వవిద్యాలయంలో నీరు కరెంటు సమస్యలు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

Water Problem in Osmania University : ఉస్మానియా యూనివర్సిటిలో నీటి ఎద్దడి, విద్యుత్ కొరత ఉండదనే నోటీసుపై విద్యార్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్‌ కోతలు ఉండవని చెప్పిన సీఎం మాటలకు విలువలేదా అని ప్రశ్నించారు. యూనివర్సిటీ చరిత్రలో ఏనాడు నీరు, కరెంటు ఎద్దడి లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ కోత, నీళ్ల కొరత మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీళ్ల కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి కారణాలతో ఇప్పటికే యూనివర్సిటీని బంద్ చేశారని, ఇక ఇప్పుడు మళ్లీ వర్సిటీకి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పరీక్షలకు సమయం దగ్గరకు వస్తున్న సమయంలో వర్సిటీకి సెలవులు ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే లేడీస్‌ హాస్టల్‌లో విద్యార్థినులు నీటి సమస్యపై రోడెక్కిన విషయం తెలిసిందే. మానేరు హాస్టల్లో ఆర్వో ప్లాంటు పాడైపోయిందని నీటి సమస్యపై చీఫ్‌ వార్డెన్‌ కార్యాలయం ముందు నిరసన కూడా చేశారు. తాజాగా వర్సిటీ విద్యార్థులు తమకు తాగునీరు అందడం లేదని, విద్యుత్‌ సమస్యలు తలెత్తుతున్నాయని వాపోయారు.

CM Revanth Reddy on Water Problem In OU : ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను చూస్తే గోబెల్‌ మళ్లీ పుట్టారనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లో, తాజాగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

Student Unions Fight in OU : ఓయూలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ

Water Department On Osmania Water Problem Issue : మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని నీటి ఎద్దడి, విద్యుత్‌ కొరత వివాదంపై జలమండలి, విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించారు. ఒప్పందం ప్రకారం 505 కేఎల్డీ నీటికి బదులు 1271 కేఎల్డీల నీటిని సరఫరా చేస్తున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్‌ రెడ్డి వివరించారు. తార్నాక, అడిక్‌మెట్‌ సెక్షన్ల నుంచి క్యాంపస్‌ నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. ఓయూ అధికారుల అభ్యర్థన మేరకు అవసరమయితే మరింత నీరు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు.

TSSPDCL On Current Issues in OU : యూనివర్సిటీలో విద్యుత్‌ కొరత అవాస్తవమని సరిపడా కరెంట్‌ సరఫరా చేస్తున్నామని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఆపరేషన్స్‌ అధికారులు వివరించారు. క్యాంపస్‌లో నీటి ఎద్దడి, విద్యుత్‌ కొరత కారణంగా వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు వసతి గృహాలు, మెస్‌లలో అంటించిన నోటీసులపై విద్యార్థులు ఆందోళన చేయడంతో వివాదం చెలరేగింది. సమస్యపై స్పందించిన చీఫ్‌ వార్డెన్‌ క్లరికల్‌ తప్పిదాలను సరిచేస్తామని వివరించారు.

ఓయూలో విద్యార్థుల ధర్నా- వీసీ రవీందర్ రాజీనామాకు డిమాండ్

ఓయూలో 'నిరుద్యోగ మార్చ్'.. విద్యార్థి నాయకులు, కాంగ్రెస్​ నేతల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.