CM Revanth Reddy on Professor Jayashankar Jayanthi : ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాంతం గడిపిన ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. గతంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడాన్ని జయశంకర్ వ్యతిరేకించారని తెలిపారు. ఏపీలో విలీనంతో జరిగిన అన్యాయాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆరు దశాబ్దాలు సజీవంగా ఉంచిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.
ఉచ్ఛ్వాస నుండి…నిశ్వాస వరకు…
— Revanth Reddy (@revanth_anumula) August 6, 2024
ఆయన నరనరాన…ప్రవహించిన ప్రాణం…
తెలంగాణ.
ప్రొఫెసర్ జయ శంకర్ సారు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.#ProfJayashankar pic.twitter.com/UP25TRWjuL
KCR On Professor Jayashankar Jayanthi : సబ్బండ వర్గాల సమున్నతే లక్ష్యంగా సాగిన పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించడమే జయశంకర్‌కు మనం అందించే ఘన నివాళి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని వారు తెలంగాణ కోసం చేసిన కృషి, త్యాగాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. వారి అడుగుజాడల్లో తాను మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి, చివరి దాకా శాంతియుత పద్ధతిలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగించి, అరవై ఏళ్ల స్వయంపాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర సాధన అనంతరం ప్రజల మద్దతుతో స్వరాష్ట్రంలో ప్రారంభమైన మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఆచార్య జయశంకర్ స్పూర్తితోనే కొనసాగించామని తెలిపారు.
పుట్టుక మీది.. చావు మీది.. బ్రతుకంతా తెలంగాణది.
— KTR (@KTRBRS) August 6, 2024
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా ఘన నివాళులు.
తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి అనిర్వచనీయం. స్వరాష్ట్ర సాధనలో ఒక… pic.twitter.com/6TTW4FXysS
KTR Tweet On Jayashankar Jayanthi : తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ చేసిన కృషి అనిర్వచనీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. స్వరాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమైనది వారి స్ఫూర్తి మరిచిపోలేనిదని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా ఘన నివాళులు అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పుట్టుక మీది చావు మీది బ్రతుకంతా తెలంగాణది జోహార్ జయశంకర్ సార్! జై తెలంగాణ అంటూ ట్వీట్ ఆయన ట్వీట్ చేశారు.
పాటకు పోరాటం నేర్పి…
— Revanth Reddy (@revanth_anumula) August 6, 2024
తన గళంలో తూటాగా మార్చి…
అన్యాయం పై ఎక్కుపెట్టిన…
తెలంగాణ సాంస్కృతిక శిఖరం…
గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.#RememberingGaddar #Gaddar pic.twitter.com/FUJ5qJh86f
గద్దర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి : మరోవైపు గద్దర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్. ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ, నీడ లభించాలనే లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. పలు ఉద్యమ సంస్థల ఏర్పాటుతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన అగ్రగణ్యుడు గద్దర్. పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ధనౌక గద్దర్. ఆయన చేసిన సాంస్కృతిక, సాహితీ సేవకు గుర్తింపుగా నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. గద్దర్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్‌తో జ్ఞాపకాలు.. ట్విటర్‌లో పంచుకున్న కేటీఆర్