ETV Bharat / state

తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్​రెడ్డి

CM Revanth Reddy on Fire Department : తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకువస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. త్వరలో 2050 విజన్‌ దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ ప్రపంచంతో పోటీ పడుతోందని, పెట్టుబడులకు అనువైన ప్రాంతమని స్పష్టం చేశారు. గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, నగర అభివృద్ది కొనసాగిందని రేవంత్ రెడ్డి వివరించారు.

CM Revanth Reddy
CM Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 1:27 PM IST

Updated : Feb 18, 2024, 2:11 PM IST

CM Revanth Reddy on Fire Department : హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో అగ్నిమాపక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, కమాండ్‌ కంట్రోల్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అగ్నిమాపక శాఖ కేవలం అగ్ని ప్రమాదాల నివారణ కోసమే కాదని, విపత్కర పరిస్థితుల్లో కూడా వీరి సేవలు అమూల్యమని కొనియాడారు. అగ్నిప్రమాదాల్లో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడే ఫైర్‌ సిబ్బంది సేవలు మరవలేనివన్నారు.

'వేసవిలో అగ్నిప్రమాదాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం'

Revanth Inaugurated on Fire Command and Control : ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అగ్నిమాపక శాఖకు భవనం లేకపోవడం సరికాదని రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వివరించారు. ఏ నగరంలో శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు, వైఎస్‌ఆర్, కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదనను చంద్రబాబు తీసుకువచ్చారని, దాన్ని కొనసాగిస్తూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పూర్తి చేశారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.

కఠిన శిక్షలతోనే ప్రమాదాల కట్టడి.. చట్టానికి పదును పెట్టేందుకు అగ్నిమాపకశాఖ కసరత్తు..!

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో రీజినల్ రింగ్ రోడ్డును త్వరలోనే తీసుకువస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్‌ సదుపాయం కూడా కల్పిస్తామని హమీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకువస్తున్నామని చెప్పారు. త్వరలో 2050 విజన్ దిశగా తాము ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. అర్బన్, రూరల్ తెలంగాణను అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతోందని, ఇక్కడ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, అందుకే మహానగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌ మూడు భాగాలుగా అభివృద్దిలో ముందుకు తీసుకెళ్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

ఫార్మాసిటీ (PharmaCity) కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ఫార్మా పరిశ్రమల ఏర్పాటు సరికాదని చెప్పారు. ఒకే చోట కాకుండా 10-15 ప్రాంతాల్లో ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామని, కానీ ఒకేచోట 25 ఎకరాల్లో ఫార్మాసిటీ ఉంటే నగరం కలుషితం అవుతుందని తెలిపారు. అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే, మేడిగడ్డ వలే అవుతుందని వ్యాఖ్యానించారు.

Revanth Inaugurated Fire services Headquarters : బాహ్యవలయ రహదారి సమీపంలోని 25,000ల ఎకరాల్లో హెల్త్‌, స్పోర్ట్స్‌, కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక సిటీని ఏర్పాటు చేయబోతున్నామని రెేవంత్‌రెడ్డి తెలిపారు. అపోహలు వద్దని, తమ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని స్పష్టం చేశారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తమ విధానమని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

"శాంతి భద్రతలు బాగుంటేనే నగరం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు, వైఎస్‌ఆర్, కేసీఆర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. అభివృద్ధి విషయంలో వారి నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తాం. నగర శివారు ప్రాంతాలకు త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డు వస్తుంది. రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు సదుపాయం కూడా కల్పిస్తాం. హైదరాబాద్‌తో పాటు మొత్తం తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు వేశాం. అర్బన్, రూరల్ తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక." - రేవంత్‌ రెడ్డి, ముఖ్యమంత్రి

తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్

అగ్నిమాపక శాఖ వార్షిక నివేదిక విడుదల - ఈ సంవత్సరం ఎంతమందిని కాపాడారంటే?

Telangana Fire Department : 'ఎలాంటి రెస్క్యూకైనా మేం రెఢీ'.. తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ

Last Updated : Feb 18, 2024, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.