ETV Bharat / state

మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్‌ - ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - Travel Safe App For Women Safety

CM Revanth Reddy Launches T-SAFE App : మహిళల ప్రయాణ భద్రత పర్యవేక్షణకు ఉపయోగపడే టీ-సేఫ్ యాప్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. టీ-సేఫ్ ద్వారా మహిళల భద్రత, ప్రయాణ పర్యవేక్షణ సేవలను పోలీసులు పర్యవేక్షించనున్నారు. మహిళాలు ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఏదైనా సంఘటనలు సంభవిస్తే పోలీసులు వెంటనే స్పందించి సహాయం చేయడానికి ఈ యాప్ ఉపయోగపడనుంది.

Travel Safe App In Telangana
CM Revanth Reddy Launches Travel Safe App
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 11:01 AM IST

CM Revanth Reddy Launches T-SAFE App : మహిళల కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు వారి భద్రత కోసం మరో ముందడుగు వేశారు. మహిళల భద్రత కోసం ఏకంగా ఓ అప్లికేషన్​ను రూపొందించారు. రాష్ట్ర పోలీసులు రూపొందించిన ‘టీ-సేఫ్‌’ యాప్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీ-సేఫ్ యాప్ మాత్రమే కాదని, అది సేవ అని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ‘ట్రావెల్‌ సేఫ్‌’ పేరిట తెలంగాణ మహిళా భద్రత విభాగం అందుబాటులోకి తెచ్చిన అందరూ వినియోగించుకోవాలని సూచించారు. వీటిని పొందేందుకు స్మార్ట్‌ ఫోన్‌ ఉండాల్సిన అవసరం లేదని, యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయనక్కర్లేదని తెలిపారు. మహిళల చేతిలో బేసిక్‌ ఫోన్‌ ఉన్నా టీ-సేఫ్‌ సేవల్ని పొందవచ్చని వెల్లడించారు.

T-SAFE App For Women Safety : మహిళలు, చిన్నారుల భద్రతకు నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర పోలీసుల్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళాశక్తి విధానాన్ని ప్రకటించిన రోజే ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్‌, మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ శిఖా గోయెల్‌ పాల్గొన్నారు.

సీ విజల్​ యాప్​లో ఫిర్యాదు చేస్తే చాలు - 100 నిమిషాల్లోనే యాక్షన్

T-Safe App For Women : మొబైల్ ద్వారా 100 లేదా 112 నంబర్‌కు ఫోన్‌ చేసిన తర్వాత ఐవీఆర్‌ ఆప్షన్‌ ద్వారా 8 నంబర్‌ను ఎంపిక చేసుకొని టీ-సేఫ్‌ సేవల్ని పొందవచ్చని అధికారులు తెలిపారు. అలాగే ఫోన్‌ చేసిన వెంటనే ఆటోమేటెడ్‌ లింక్‌ వస్తుంది. దీనిని ఉపయోగించి గూగుల్‌ ప్లేస్టోర్‌లో లేదా టీ-సేఫ్‌ వెబ్‌ పేజీలో అందుబాటులో ఉన్న ట్రావెల్‌ సేఫ్‌ అప్లికేషన్‌ ద్వారా సేవను పొందవచ్చు. రాష్ట్రంలోని 791 పెట్రోలింగ్‌ కార్లు, 1085 బ్లూకోల్ట్స్‌ వాహనాలను ఈ యాప్‌తో అనుసంధానం చేయనున్నారు. వినియోగదారులు తమ ప్రయాణ వివరాల్ని కుటుంబ సభ్యులతోనూ లైవ్‌ లొకేషన్‌ లింక్‌ ద్వారా షేర్‌ చేసుకోవచ్చు.

TSRTC Gamyam App : ఒక్క క్లిక్​తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?

Gamyam App in TSRTC Ordinary Buses : ఇకపై ఆర్డినరీ బస్సులకీ 'గమ్యం' యాప్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.